అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ - బీజేపీ ఒక్కటే : వీర్రాజుకు అమరావతి రైతు షాక్ : చంద్రబాబు మమ్మల్ని వీడారు - ఓడారు..!!

|
Google Oneindia TeluguNews

అమరావతి గ్రామాల్లో పర్యటిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. మనం - మన అమరావతి పేరుతో బీజేపీ పాదయాత్ర చేస్తోంది. ఆ సమయంలో స్థానిక రైతులు సోము వీర్రాజు పైన ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారు. బీజేపీ ఇప్పుడు అమరావతి గ్రామాల్లో పర్యటించటం పైన ప్రశ్నించిన స్థానిక రైతు..అమరావతి ఎప్పుడు పూర్తి చేస్తారని నిలదీసారు. జగన్ మూడు రాజధానులు అంటున్నారని.. జగన్ - బీజేపీ ఒక్కటేనంటూ వ్యాఖ్యానించారు. దీనికి సోము వీర్రాజు నచ్చ చెప్పే ప్రయత్నం చేసారు.

రైతు నిలదీతతో వీర్రాజు షాక్

రైతు నిలదీతతో వీర్రాజు షాక్

కేంద్రం ఇప్పటి వరకు అమరాతి కోసం రూ 8500 కోట్లు మంజూరు చేసిందని చెప్పుకొచ్చారు. ఎందుకు ఆ నిధులు కేటాయించిందీ వివరించారు. ఇప్పుడు అమరావతి రైతుల కోసమే తాము వచ్చామంటూ వీర్రాజు చెప్పారు. చంద్రబాబు సగం కట్టి ఓడిపోయి వెళ్లిపోయారని..జగన్ అసలు అమరావతి వద్దంటున్నారని వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల ముందు చంద్రబాబు బీజేపీని వీడిన కారణంగానే ఓడిపోయి..జగన్ గెలిచారంటూ సోము వీర్రాజు చెప్పుకొచ్చారు. చంద్రబాబు బీజేపీతో ఉంటే గెలిచావారని వ్యాఖ్యానించారు. రెండు ఏళ్లల్లో తాము అమరావతి నిర్మించి ఇస్తామని వీర్రాజు హామీ ఇచ్చారు.

జగన్ - బీజేపీ ఇద్దరూ ఒక్కటేనంటూ

జగన్ - బీజేపీ ఇద్దరూ ఒక్కటేనంటూ


జగన్ - బీజేపీ ఇద్దరూ దొంగమాటలు చెబుతున్నారంటూ రైతులు షాక్ ఇచ్చారు. జగన్ తో తమకు సంబంధం లేదని వీర్రాజు వివరణ ఇచ్చారు. ఇదే సమయంలో.. ఆర్థిక స్థితి బాగుంటే రాజధాని ఎందుకు కట్టడంలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. మొదటి రోజు పాదయాత్ర ఉండవల్లి నుంచి పెనుమాక, కృష్ణాయపాలెం, యర్రబాలెం వరకు కొనసాగనుంది. రాష్ట్ర ప్రజలకు రాజధాని లేకుండా చేశారని ఇందులో వైసీపీతో పాటుగా టీడీపీ కూడా కారణమేనని వీర్రాజు వ్యాఖ్యానించారు. అమరావతిలో నిర్మాణాలు వెంటనే ప్రారంభించాలని, రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సోమువీర్రాజు డిమాండ్‌చేశారు.

అందుకే చంద్రబాబు ఓడిపోయారు

అందుకే చంద్రబాబు ఓడిపోయారు

రాజధాని కోసం తీసుకున్న భూముల్లో ఏమేం చేస్తారో వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. పోలవరం పరిహారానికి ప్రభుత్వం వద్ద నిధులు లేవని జగన్ చెబుతున్న ప్రింటింగ్ మిషన్ కేంద్రం వద్ద ఉండదని తెలిపారు. పోలవరం ఏటీఎం కాకూడదని, ఆర్​ఆర్ ప్యాకేజ్ నివేదిక రాష్ట్రం... కేంద్రానికి ఇవ్వటంలేదని సోమువీర్రాజు ఆరోపించారు. ఆర్దిక పరిస్థితి బాగుంటే ఎందుకు రోజూ అప్పుల కోసం పరిగెడుతున్నారని ప్రశ్నించారు. ఆగష్టు 4వ తేదీ వరకు రాజధాని గ్రామాల్లో బీజేపీ నేతలు పాదయాత్ర చేయనున్నారు.

English summary
Amarvati farmers questioned BJP state Chief Somu Veerraju on relation with jagan on Capital Issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X