తమిళనాడు మ్యూజియంలో 'అమరావతి' శిల్పాలు, ఇవ్వాలని లేఖ
అమరావతి: ఏపీ రాజధాని అమరావతికి తమిళనాడు నుంచి అపురూప శిల్పాలు తరలించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. అప్పటి అమరావతిలోని కొన్ని వందల శిల్పాలను చెన్నై ఎగ్మోర్‌లోని ప్రభుత్వ మ్యూజియంలో భద్రంగా ఉంచారు.
ఇప్పుడు నవ్యాంధ్రకు రాజధాని నిర్మిస్తున్న నేపథ్యంలో వాటిని ఏపీకి తీసుకు వెళ్లేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.త ఇప్పటికే ఈ శిల్పాల గురించి ఆంధ్రా ఉన్నతాధికారులు తమిళనాడుకు లేఖ రాశారు. దాని పైన తమిళనాడు కూడా సానుకూలంగా స్పందిస్తున్నట్లుగా తెలుస్తోంది.

తగిన నివేదిక ఇవ్వాలని ఇప్పటికే తమిళనాడు అధికారులు ఎగ్మోర్ మ్యూజియం అధికారులను ఆదేశించారు. అలనాటి అమరావతిలో బౌద్ధులకు సంబంధించిన శిల్పాలు 400కు పైగా ఇప్పుడు ఎగ్మోర్ మ్యూజియంలో ఉన్నాయి.
నాడు బ్రిటిష్ పాలకులు నిర్వహించిన పురావస్తు తవ్వకాల్లో ఇవి బయటపడ్డాయి. వాటిని చెన్నైకు తీసుకు వెళ్లి భద్రపరిచారు. కాగా, ఎగ్మోర్ మ్యూజియంలో ఉన్న అమరావతి శిల్పాలు మన అరుదైన సంపద అని డెవలప్‌మెంట్ అథారిటీ అధ్యక్షులు వీరాంజనేయులు జాస్తి చెప్పారు.












Click it and Unblock the Notifications