అమరావతిని ముంచెత్తిన వరద..!!

కృష్ణా నది మహోద్ధృతంగా ప్రవహిస్తోంది. నదీ పరివాహక ప్రాంతాల్లో జనం బిక్కుబిక్కుమంటున్నారు. దాదాపు 8 లక్షల క్యూసెక్కుల వరదనీరు నదిలో ప్రవహిస్తుండటంతో తీర ప్రాంతాలు నీట మునిగాయి. గ్రామాల్లో వరదనీరు చేరింది. అమరావతి తో సహా తుళ్లూరు మండలంలోనూ పలు గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. ప్రకాశం బ్యారేజ్ ఇన్ ఫ్లోతో కృష్ణా కరకట్ట తెగే ప్రమాదం అధికారులు ఆందోళనలో ఉన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

కరకట్ట పరిసరాలు
అమరావతి నుండి సిఎం చంద్రబాబు ఇంటి వైపుగా ఉండే కృష్ణా కరకట్ట తెగే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. దీంతో కృష్ణ కరకట్ట వాసులు భయం గుప్పెట్లో ఉన్నారు. దీని ప్రభావంతో రాజధాని ప్రాంతంలో ముంపు పెరగనుంది. ఇప్పటికే గంట గంటకు పెరుగుతున్న ప్రకాశం బ్యారేజ్ ఇన్ ఫ్లోతో ఆందోళన పెరుగుతోంది. గత 120 సంవత్సరాల్లో రికార్డులను అధిగమిస్తూ భారీగా వరద నీరు వచ్చింది. 1903, 2009లో వచ్చిన వరద రికార్డులను అధిగమిస్తూ 11.37 లక్షల క్యూసెక్కులకు వరద నీరు చేరింది.

Amaravati Temple and Surrounding villages effected with Krishna River Flood water

పెరుగుతున్న వరద
తుళ్లూరు మండలంలోని లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమంలో గ్రౌండ్ ఫ్లోర్ నీట మునిగింది. అక్కడ ఉన్న వారిని తరలించారు. అమరావతి లోని అమరేశ్వర ఆలయం, పోలీసు స్టేషన్, పట్టణం మొత్తం జలదిగ్బంధంలో చిక్కుకుంది. పలువురి నివాసాలు వరద నీటిలో ఉన్నాయి. స్థానిక అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. అమరావతి పరిధిలో కరకట్ట తెగితే ప్రమాదమని ముందే మట్టికట్టలు వేసిన గ్రామస్థులు అప్రమత్తం అయ్యారు.

అప్రమత్తం
ఇటు ప్రకాశం బ్యారేజ్‌ మొత్తం 70 గేట్లు తెరిచి సముద్రంలోకి నీటి విడుదల చేసారు. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసారు. బ్యారేజ్‌ నుంచి 11.42 లక్షల క్యూసెక్కులు విడుదల అయింది. కాల్వలకు 500 క్యూసెక్కులు విడుదల చేసినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 70 గేట్లు తెరిచి సముద్రంలోకి నీటి విడుదల చేయటంతో..ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్‌ వద్ద 24.5 అడుగుల మేర కొనసాగుతున్న నీటిమట్టం కొనసాగుతోంది. ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా అప్రమత్తం అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+