శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమరావతి రైతుల మలిదశ ఉద్యమం - ఇదే కీలకం..!!

|
Google Oneindia TeluguNews

అమరావతి: మూడు రాజధానుల ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు రెండోదశ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఇవ్వాళ్టి నుంచి మలిదశ పాదయాత్రను చేపట్టనున్నారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో గల సూర్యభగవానుడి ఆలయం వరకు కొనసాగతుంది. రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరం లేదని, అమరావతిని మాత్రమే ఏకైక రాజధానిగా కొనసాగించాలనేది వారి డిమాండ్.

60 రోజుల పాటు..

60 రోజుల పాటు..


మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ చేపట్టిన ఉద్యమానికి 1,000 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ మహా పాదయాత్రను ఆ ప్రాంత రైతులు చేపట్టారు. వెంకటపాలెంలో శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద దీనికి నాంది పలికారు. తెల్లవారు జామున 5 గంటలకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మొత్తం 60 రోజుల పాటు 630 కిలోమీటర్ల మేర కొనసాగుతుంది. అమరావతి పరిరక్షణ సమితి దీన్ని నిర్వహిస్తోంది.

వైసీపీయేతర పార్టీల మద్దతు..

వైసీపీయేతర పార్టీల మద్దతు..

తెలుగుదేశం, భారతీయ జనత పార్టీ, జనసేన, వామపక్షాలు.. మూడు రాజధానులను వ్యతిరేకిస్తోన్నాయి. అమరావతిని మాత్రమే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ డిమాండ్ చేస్తోన్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల నాయకులు కూడా ఈ యాత్రలో భాగస్వామ్యులు కానున్నారు. ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, ఏలూరు, కోనసీమ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, విజయనగరం, పార్వతిపురం మన్యం మీదుగా శ్రీకాకుళంలోని అరసవల్లి వరకు యాత్ర కొనసాగనుంది. మలిదశ పాదయాత్ర ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగాలని కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు యాగాన్ని నిర్వహించారు. మందడంలోని దీక్షా శిబిరంలో యాగం చేశారు.

 న్యాయస్థానం టు దేవస్థానం..

న్యాయస్థానం టు దేవస్థానం..

ఇదివరకు అమరావతి ప్రాంత రైతులు న్యాయస్థానం టు దేవస్థానం పేరిట తొలిదశ పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. అమరావతి నుంచి తిరుపతి వరకు కాలినడకన వెళ్లారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల గుండా మొత్తం 400 కిలో మీటర్ల మేర యాత్ర సాగింది. పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు. దీనికి హైకోర్టు ఇటీవలే అనుమతులు మంజూరు చేసింది.

మూడు రాజధానుల బిల్లుకు..


ఈ నెల 15వ తేదీ నుంచి ఆరంభం కాబోయే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ- మూడు రాజధానులకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తోన్న నేపథ్యంలో- అమరావతి ప్రాంత రైతుల మలిదశ పాదయాత్రకు ప్రాధాన్యతను సంతరించుకుంది. పాదయాత్ర కొనసాగుతున్న సమయంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టొచ్చనే ప్రచారం సాగుతోంది.

English summary
Amaravati Parirakshna Samithi for its proposed Maha Padayatra from Amaravati to Arasavalli in Srikakulam district in support of continuing Amaravati as the sole capital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X