అమర్నాథ్ యాత్రలో విషాదం: ఏపీకి చెందిన ఇద్దరు మహిళల మృతదేహాలు గుర్తింపు
శ్రీనగర్: భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో అమర్నాథ్ యాత్రలో విషాదం నెలకొంది. అమర్నాథ్ యాత్రకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమహేంద్రవరంకు చెందిన ఇద్దరు మహిళలు మృతి చెందారు. వరదల కారణంగా గల్లంతైన సుధ, పార్వతి అనే మహిళల మృతదేహాలను సహాయక బృందాలు సోమవారం గుర్తించాయి. కాగా, ఇప్పటి వరకు వరదల కారణంగా మృతి చెందినవారి సంఖ్య 18కి చేరుకుంది.
ఏపీకి చెందిన మరో 32 మంది ఆచూకీ లభించాల్సి ఉంది..
అమర్నాథ్ అకస్మిక వరదల్లో చిక్కుకుపోయిన.. ఏపీకి చెందిన యాత్రికుల్లో ఇంకా 34 మంది ఆచూకి తెలియాల్సి ఉందని.. రాష్ట్ర పౌర సంబంధాల శాఖకు సమాచారం అందింది. నెల్లూరు నుంచి రెండు బృందాలుగా వెళ్లిన 29మందితో పాటు ఏలూరు నుంచి ఇద్దరు, తణుకు ఉండ్రాజవరం నుంచి ఒకరి ఆచూకీ గురించి అధికారులు వెల్లడించారు.

అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన.. పలువురు తెలుగు యాత్రికుల క్షేమ సమాచారాలు వరదల తర్వాత అందకపోవడంతో.. రెవెన్యూ అధికారులు వారి చిరునామాలు, ఫోన్ నంబర్ల ఆధారంగా ఇళ్లకు వెళ్లి విచారిస్తున్నారు. ఈ సందర్భంగా కొందరు తమ బంధువులు క్షేమంగానే ఉన్నారని చెప్పగా మరికొందరు.. విపత్తుకు ముందే తమ వారు వెళ్లిపోయారని తెలిపారు.
అయితే ఇంకొందరు మాత్రం తమవారి ఫోన్లు స్విచాఫ్ వస్తున్నాయని, ఆచూకి దొరకడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో.. మెుత్తం 34మంది ఆచూకి తెలియాల్సి ఉందని అధికారులకు నిర్ధరణకు వచ్చారు. అయితే, తాజాగా, రాజమండ్రికి చెందిన ఇద్దరు మహిళల మృతదేహాలు లభ్యం కావడంతో మరో 32 మంది ఆచూకీ లభించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications