నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లక్కీడ్రా గెలుపుపై అంబటి, లక్ష్మీపార్వతికి కోపమొచ్చింది

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Ambati happy with Nellore ZP chairman winning
హైదరాబాద్: ఎస్పీఎస్ నెల్లూరు జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో తమ పార్టీ గెలుపొందడంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆదివారం స్పందించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జిల్లాలో 31 స్థానాలను గెలుచుకున్న తమ పార్టీ పూర్తి మెజార్టీ సాధించిందన్నారు. అయితే అధికార పక్షం కుట్రలు పన్ని జడ్పీ పీఠాన్ని దక్కించుకునేందుకు యత్నించిందని ఆరోపించారు.

ఈ క్రమంలోనే తమ పార్టీ తరఫున గెలిచిన ఎనిమిది మంది జడ్పీటీసీలను తమవైపు తిప్పుకుని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందన్నారు. అయితే అనేక ఊహించని పరిణామాల మధ్య జరిగిన ఎన్నికలో గెలుపు తమనే వరించిందన్నారు. దీంతో ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిచ్చిన టీడీపీకి తగిన గుణపాఠం నేర్పినట్లైందన్నారు. ప్రశాంతంగా జరగాల్సిన ఎన్నిక ఉద్రిక్త వాతావరణంలో జరగాల్సి రావడం దురదృష్టకరమన్నారు.

లక్ష్మీపార్వతి ఆగ్రహం

జూబ్లీహిల్స్‌లో ఉన్న కేబీఆర్ పార్క్ ఎంట్రీ ఫీజును ఏడాదికి రూ. 800 నుంచి రూ. 1500కు పెంచడంపై వైయస్సార్ కాంగ్రెసు పార్ట మహిళా నాయకురాలు లక్ష్మీపార్వతి మండిపడ్డారు. ఈ పార్కుకు ఎంతోమంది వాకింగ్ కోసం వస్తుంటారని, దాదాపు 70 మంది సీనియర్ సిటిజన్లు కూడా రోజూ వాకింగ్ చేస్తుంటారన్నారు.

వీరిలో మధ్యతరగతి వారు కూడా ఉన్నారన్నారు. ఫీజును పెంచడంలో తప్పులేదని, కాకపోతే ఒకేసారి రెండింతలు చేయడం సరికాదన్నారు. ఎవర్నీ వాకింగ్ చేయరాదని ప్రభుత్వం చెబుతోందా? అని విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయం అత్యంత దారుణమన్నారు.

English summary
YSR Congress Party leader Ambati Rambabu is happy with Nellore ZP chairman winning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X