అఖిలపై దాడి జరిగినట్లుగా, భూమా సవాల్.. జగన్ వస్తారు: అంబటి, ఇదీ టిడిపి దాడి చిట్టా

ఎమ్మెల్యే అఖిల ప్రియ పైన దాడి ఘటన పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు శుక్రవారం నాడు తీవ్రంగా స్పందించారు.

విజయవాడ: ఎమ్మెల్యే అఖిల ప్రియ పైన దాడి ఘటన పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు శుక్రవారం నాడు తీవ్రంగా స్పందించారు. అఖిల ప్రియ పైన దాడి జరిగినట్లుగా టిడిపి నేతలు అలజడి సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

అఖిల ప్రియపై దాడి: అసలు ఏం జరిగిందంటే...! 'జగన్‌కు ఎదురు ఇష్టం లేకే'

ఎంతో ముఖ్యమైన రైతుల సమస్యలను పక్కదారి పట్టించేందుకు చవకబారు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఈ ఘటన జరిగినప్పుడు తాను అక్కడే ఉన్నానని, ఎలాంటి దాడి లేదా గొడవ జరగలేదని చెప్పారు. దాడి చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు.

ఎనిమిది మంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అరెస్టు చేయడం చాలా దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మహిళా అధికారి పైన దాడి చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు వత్తాసు పలికారన్నారు.

akhila pariya

ఎమ్మెల్యే సతీష్ టూరిజం సిబ్బంది పైన దాడి చేసినా కేసు పెట్టేందుకు వెనుకాడారన్నారు. అఖిల ప్రియ తండ్రి భూమా నాగిరెడ్డి కాంట్రాక్టర్లను బెదిరించినా కేసు పెట్టలేదు ఎందుకో చెప్పాలన్నారు. అలాంటిది ఇప్పుడు తమ కార్యకర్తల పైన కేసు పెట్టారన్నారు.

భూమా సవాల్ చేశారు, జగన్ వస్తారు

అక్రమ కేసులను ఎట్టి పరిస్థితుల్లోను ఊరుకునేది లేదని చెప్పారు. పార్టీ మారిన భూమా నాగిరెడ్డికి దమ్ముంటే, ఆయన అఖిల ప్రియ రాజీనామా చేసి గెలవాలన్నారు. నంద్యాలకు రమ్మని సవాల్ విసిరారని కచ్చితంగా వైయస్ జగన్ నంద్యాల వస్తారని చెప్పారు.

నిన్న పవన్... నేడు జగన్‌కు 'మెగా' షాక్: దాసరిని చిరంజీవి అడ్డుకుంటున్నారా!?

2015 డిసెంబర్ నెలలో పంటకు నిప్పు పెట్టిన ఘటనలో ఇప్పటి వరకు ఏ ఒక్కరినీ అరెస్టు చేయలేదన్నారు. ఫ్యాన్సీ నెంబరు కోసం టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ అనుచరులు దౌర్జన్యానికి పాల్పడ్డారని, దానిని చిత్రీకరించిన విలేకరిని అసభ్య పదజాలంతో దూషించారని గుర్తు చేశారు. అలాంటి వారిపై కేసులెందుకు పెట్టలేదని నిలదీశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+