చంద్రబాబు డిజిపిలా, రాముడు పచ్చా చొక్కా వేసుకున్నట్లుగా: అంబటి
హైదరాబపాద్: పోలీసు వ్యవస్థను కించపరిచేలా మాట్లాడాల్సిన అవసరం తమకు లేదని వైయస్సార్ కాంగ్రెసు అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. డిజిపి జేవీ రాముడు ఖాకీ చొక్కా విప్పి పచ్చచొక్కా వేసుకుని పనిచేస్తున్నారని, చంద్రబాబే అసలు డీజీపీలా వ్యవహరిస్తున్నారన్న మాట వినిపిస్తోందని ఆయన విమర్శించారు.
తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ఆయన చెప్పారు. డీజీపీపై తాము చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని రాంబాబు అన్నారు.

డీజీపీ రాముడు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పోలీసు వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోందని ఆయన అన్నారు. ముప్పాళ్లలో తనపై జరిగిన దాడి విషయాన్ని డీజీపీకి స్వయంగా తానే చెప్పినా ఇంతవరకు పట్టించుకోలేదని, అలాగే రాజధాని ప్రాంతంలోని పొలాలను తగులబెట్టిన దోషులను కూడా ఇంతవరకు పట్టుకోలేదని ఆయన గుర్తు చేశారు.
చంద్రబాబు సభలో రైతు ఆత్మహత్యకు ప్రయత్నించడం దారుణమని, రైతులను మోసం చేసినందుకు చంద్రబాబు వారందరికీ క్షమాపణ చెప్పాలని అంబటి రాంబాబు అన్నారు. రుణమాఫీ పేరుతో మోసగించినందుకే ఆ రైతు ప్రాణాలు తీసుకోవాలని ప్రయత్నించాడని అన్నారు.












Click it and Unblock the Notifications