ఎన్నికల ఫలితాలపై ఏపీ మంత్రి తాజా అంచనాలు..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. గెలుపు కోసం ప్రధాన పార్టీల మధ్య హోరా హోరీ పోరాటం సాగుతోంది. ఇటు సర్వే సంస్థలు తమ అంచనాలను వెల్లడిస్తున్నాయి. సీఎం జగన్ వైసీపీ మరో సారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు తన ప్రచారంలో ఏపీలో కూటమి అధికారంలోకి వస్తుందని చెబుతున్నారు. పవన్ సైతం కూటమి విజయం ఖాయమని చెప్పుకొచ్చారు. ఈ సమయంలో మంత్రి అంబటి ఏపీలో ఎన్నికల ఫలితాల పై తన అంచనాలను వెల్లడించారు.
మంత్రి అంబటి రాంబాబు టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలోనూ చంద్రబాబు ఓడిపోతారని మంత్రి అంబటి రాంబాబు జోస్యం చెప్పారు. ఎన్నికల తర్వాత జగన్ మరోసారి సీఎం అవ్వడం, చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత టీడీపీని బీజేపీలో విలీనం చేస్తారన్నారు. చంద్రబాబును తిట్టిన వాళ్లంతా ఇప్పుడు ఆయన పక్కనే ఉన్నారన్నారు. తాను పండక్కి డ్యాన్స్ చేస్తే విమర్శిస్తున్నారు.. కానీ చంద్రబాబు, ఆయన పక్కన ఉండే పవన్ కల్యాణ్ పొలిటికల్ డ్యాన్స్‌ర్లని సెటైర్ వేశారు.

పవన్ డబ్బుల కోసం డ్యాన్స్ వేస్తే.. చంద్రబాబు అధికారం కోసం అన్ని పార్టీలతో డ్యాన్స్ వేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఓడిపోతామనే ఫ్రస్టేషన్‌తో చంద్రబాబు ఏదేదో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తాను చంద్రబాబును రాజకీయంగా మాత్రమే విమర్శించానని స్పష్టం చేశారు. చంద్రబాబు సభకు జనమే రాలేదని అన్నారు. చంద్రబాబు అసమర్థత వల్లే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము వద్దనుకున్న వారికి చంద్రబాబు, పవన్ సీట్లు ఇస్తున్నారని ఎద్దేవా చేసారు. చంద్రబాబుకు తన పార్టీ అభ్యర్దుల పేర్లు కూడా గుర్తు లేవని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో తిరిగి జగన్ సీఎం కావటం ఖాయమని.. టీడీపీ బీజేపీలో విలీనం అవుతుందంటూ అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications