జేసీ బ్రదర్స్‌ను కాపాడేందుకే చంద్రబాబు పాట్లు: ఏకేసిన అంబటి
ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కృష్ణా జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనలో దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యాన్ని రక్షిం
హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కృష్ణా జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనలో దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యాన్ని రక్షించేందుకే చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అంబటి రాంబాబు చెప్పారు.
గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి మీడియాతో మాట్లాడారు. ఇంత భారీ ప్రమాదాన్ని, ప్రాణ నష్టాన్ని కప్పిపెట్టే కుట్ర జరిగిందని ఆయన ఆరోపించారు. బాధితుల్ని పరామర్శించడానికి వెళ్లిన ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిపై కేసు పెట్టి అసలు విషయాన్ని ప్రభుత్వం, ప్రభుత్వానికి సంబంధించిన తాబేదార్లు పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు.

ఇలాంటి సంఘటనలు అనేకం జరిగినప్పుడు జగన్ వెళ్లి బాధితులకు మనోధైర్యం కలిగించారని, అప్పుడు అధికారులు ఎవ్వరూ వివాదం చేయడానికి ప్రయత్నించలేదని చెప్పారు. ప్రస్తుత ఘటనలో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి చెందిన దివాకర్ ట్రావెల్స్ తప్పులేదని చూపించటానికి చంద్రబాబు పడరాని పాట్లు పడుతున్నారని ఎద్దేవా చేశారు.
ప్రమాదంలో మరణించిన డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం చేయకుండా రలించేందుకు ప్రయత్నించడంపై డాక్టర్, కలెక్టర్‌ను జగన్ ప్రశ్నించారని చెప్పారు. జగన్ మాటలను సరిగా అర్ధం చేసుకోకుండా ఐఏఎస్‌ల సంఘం మాట్లాడటం సరికాదని అంబటి అన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులంటే తమకు గౌరవం ఉందని చెప్పారు. వారిలో నీతినిజాయితీ గలవారు ఉన్నారని, పోస్టుల కోసం కక్కుర్తిపడే వాళ్లు కూడా ఉన్నారని అన్నారు. గతంలో చంద్రబాబు కూడా అధికారుల పట్ల ఇంతకన్నా దారుణంగా వ్యవహరించారని గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications