జగనే తొలి సిఎం, ఆ సమయంలో..: లగడపాటిపై అంబటి

తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతో సర్వేలు చేసినట్లుగా చెబుతున్నారన్నారు. జగన్‌ను దెబ్బతీసేందుకు లగడపాటి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. సీమాంధ్రలో తాము పూర్తి మెజార్టీతో విజయం సాధిస్తామని అంబటి ధీమా వ్యక్తం చేశారు.
మేజర్ సర్వేలు అన్నీ తమ పార్టీ వైపే ఉన్నాయని చెప్పారు. తమ పార్టీకి 18 లోకసభ స్థానాలు వస్తాయని చెప్పారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. స్థానిక, సార్వత్రిక ఎన్నికల మధ్య నెల రోజుల వ్యవధి వచ్చిందని, ఆ సమయంలో ఎన్నో రాజకీయ మార్పులు జరిగాయని అంబటి అన్నారు. తమ పార్టీకి 110 సీట్లు వస్తాయని చెప్పారు.
సర్వేలు చేయించానని చెబుతూ లగడపాటి తప్పుడు ఫలితాలను వెల్లడిస్తున్నారన్నారు. లగడపాటి నిజంగా సర్వేలు చేయించి ఉంటే ఏ సంస్థతో చేయించాడో వెల్లడించాలని డిమాండ్ చేశారు. లగడపాటి సర్వేలను నమ్మి ఎవరూ బెట్టింగులు కాయవద్దన్నారు. సీమాంధ్ర తొలి ముఖ్యమంత్రి జగనే అన్నారు.












Click it and Unblock the Notifications