తిరుమల అన్నప్రసాదం ప్రశంసల వీడియోపై స్పందించిన అంబటి రాంబాబు.. ఏమన్నారంటే!

తిరుమల అన్నప్రసాదం పైన మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అంబటి రాంబాబు వ్యవహార శైలిపై రాజకీయ వర్గాలలో కూడా ఆసక్తికర చర్చ జరుగుతుంది. వైసిపి నాయకుడు కరుడుగట్టిన టిడిపి వ్యతిరేకి అయిన అంబటి రాంబాబు తిరుమలలో అన్న ప్రసాదం నాణ్యతను ప్రశంసిస్తూ విడుదల చేసిన వీడియో ఇప్పుడు చర్చకు కారణమైంది.

తిరుమల అన్న ప్రసాదంపై అంబటి వ్యాఖ్యలపై క్లారిటీ
కూటమి ప్రభుత్వం పైన తరచు విమర్శలు చేసే అంబటి రాంబాబు లాంటి నాయకుడు అన్న ప్రసాదం నాణ్యతను కొనియాడుతూ చేసిన వ్యాఖ్యల పైన జరుగుతున్న రచ్చ నేపథ్యంలో తాజాగా అంబటి రాంబాబు దీనిపైన స్పష్టత నిచ్చారు. కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో గుంటూరు కోర్టు వద్ద నేడు నిర్వహించిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేక కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొన్న అంబటి రాంబాబు తిరుమల అన్న ప్రసాదం పై తాను చేసిన వ్యాఖ్యలను గురించి మాట్లాడారు.

Ambati Rambabu responded to the video praising Tirumala Annaprasadam What did he say

టీటీడీ చైర్మన్ పై అంబటి రాంబాబు విమర్శలు
1985 నుంచి తిరుమలలో ఉచిత భోజన వసతి ఉందని గుర్తు చేశారు. ఇటీవల తాను శ్రీవారి ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ అన్నప్రసాదాన్ని తిన్నానని, కాబట్టే అది బాగుందని చెప్పానని, ఇక దీనిని కూడా టిడిపి రాజకీయం చేస్తుందని ఆయన మండిపడ్డారు. టిటిడి చైర్మన్ గా ఉన్న బిఆర్ నాయుడు దీనిపైన గొప్ప ప్రచారం చేసుకుంటున్నారని అంబటి రాంబాబు విమర్శించారు.

వారిది శునకానందం అన్న అంబటి రాంబాబు
దేవుడితో రాజకీయాలు చేయడం కూటమినేతలకు అలవాటేనని ఆయన ఆరోపించారు. చంద్రబాబు తిరుమల లడ్డు ప్రసాదంతో రాజకీయం చేశారని ఇప్పుడు అన్నప్రసాదంపైన తన వ్యాఖ్యలపైన కూడా రాజకీయాలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఇక ఈ విషయంపైన సోషల్ మీడియా వేదికగా కూడా స్పందించిన ఆయన తిరుమల వెంగమాంబ ఉచిత భోజనం గురించి తాను చెప్పిన మంచి మాటలకు శునకానందం పొందుతున్న వారికి అభినందనలు అంటూ ట్వీట్ చేశారు.

అంబటి రాంబాబు తిరుమల అన్నప్రసాదంపై చెప్పింది ఇదే
తిరుమలలో వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఉచిత భోజనం రుచికరంగా ఉంటుందని, వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం కూడా చాలా శుభ్రంగా ఉంటుందని అంబటి రాంబాబు ప్రశంసించారు. ఇక ఇదే విషయాన్ని ఒక వీడియోలో ఆయన పంచుకోగా, ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. టిడిపి ప్రభుత్వ పాలనలో తిరుమలలో అన్న ప్రసాదం బాగుందని అంబటి రాంబాబు చెప్పినట్టుగా తెలుగుదేశం శ్రేణులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నట్టు ఆయన అసహనం వ్యక్తం చేశారు. దీనిపైన క్లారిటీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+