వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బాబు ఇక మందుబాబు నాయుడు: 'ఏపీ'కి అంబటి కొత్త అర్థం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు శుక్రవారం నాడు కొత్త అర్థం చెప్పారు. ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ కాదని, అవినీతి ప్రదేశ్ అని ఆయన ఎద్దేవా చేశారు. ఏపీలో అన్నింటా అవినీతి జరుగుతోందని ఆరోపించారు.
ఎన్టీఆర్ సుజల స్రవంతిని గాలికి వదిలేసిన ప్రభుత్వ అధికారులు నారా వారి సారా స్రవంతిని విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారని ధ్వజమెత్తారు. కమీషన్ల కోసం కాపురాలు కూలుస్తున్నారని, చంద్రబాబును మందుబాబు నాయుడని పిలిచే రోజులు రానున్నాయన్నారు.
Also Read: కేసీఆర్ కంటే తక్కువ..! నాకు ఆ ర్యాంక్ ఇస్తారా: మోడీపై బాబు అసహనం

ప్రచార ఆర్భాటాలకు పెద్దపీట వేస్తున్నారని విమర్శించటారు. ప్రజా ప్రయోజనాలను పట్టించుకోవడం లేదన్నారు. చంద్రబాబు విజన్ 2020 అంటే ఇదేనా అని ప్రశ్నించారు. తమ పార్టీ ప్రజల కోసం పోరాడుతుందని చెప్పారు.