బయటకు రా, మనం తెలుగువారి పౌరుషం చూపించాలి: బాబుకు అంబటి
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వమని కేంద్రం చెప్పినప్పటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రంలోనే ఉండటం సిగ్గుచేటు అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు శుక్రవారం నాడు ధ్వజమెత్తారు.
ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చే బాధ్యత ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు లేదా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ఎప్పుడు కూడా చిత్తశుద్ధితో పని చేయలేదన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కేంద్రంతో రాజీపడుతున్నారన్నారు.

తెలుగువారి పౌరుష చూపించాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. ఈ నెల పదవ తేదీన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించే ధర్నాలకు అందరూ మద్దతివ్వాలని అంబటి రాంబాబు సూచించారు. హామీలు, హోదా అమలకు ధర్నా చేస్తున్నట్లు చెప్పారు.
కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక హోదా రాదనే విషయం ఎప్పుడో తెలుసునని, దానిని బయటకు చెప్పడం లేదని, అందుకే ఆయన హోదాకు బదులు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ అడుగుతున్నారని చాలా రోజుల క్రితం ఎంపీ జేసీ దివాకర్ అన్నారు.
దీనిని కూడా వైసిపి నేతలు ప్రస్తావిస్తున్నారు. చంద్రబాబుకు ప్రత్యేక హోదా రాదని ఎప్పుడో తెలుసునని, అయినప్పటికీ ఒప్పిస్తానని చెప్పడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రత్యేక హోదా పైన చంద్రబాబు ఇప్పటికైనా చిత్తశుద్ధితో పోరాటానికి తమతో కలిసి రావాలని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications