పవన్‌కు ఇప్పుడర్థమైంది, తొలుత మా వద్దకే వచ్చారు: అంబటి రాంబాబు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు అంబటి రాంబాబు తీవ్రంగా విరుచుకుపడ్డారు. దేశ రాజకీయాల్లో చంద్రబాబు నెంబర్ వన్ ద్రోహి అని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రత్యేక హోదాపై చంద్రబాబు పిల్లిమొగ్గలు వేస్తున్నారని ఆయన మంగళవారం మీడియా సమావేశంలో విమర్సించారు. ఆరు వందల వాగ్దానాలు ఇచ్చిన చంద్రబాబు ఒక్క హామీనైనా నిలబెట్టుకున్నారా అని ఆయన ప్రశ్నించారు.

 దొంగే దొంగ అన్నట్లుగా ఉంది....

దొంగే దొంగ అన్నట్లుగా ఉంది....

ద్రోహులను ఎన్నికల్లో ఓడించాలని చంద్రబాబు అనడం విడ్డూరంగా ఉందని అంబటి రాంబాబు అన్నారు. దొందే దొంగా దొంగా అని అరిచినట్లుగా చంద్రబాబు వైఖరి ఉందని వ్యాఖ్యానించారు రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు వంటి ద్రోహులకు డిపాజిట్లు కూడా రావని అన్నారు.

 కొత్త మిత్రుల కోసం వెంపర్లాట

కొత్త మిత్రుల కోసం వెంపర్లాట

చిత్తూరు పార్లమెంటు సభ్యుడు మేకప్ వేసుకుని వేషాలు వేస్తుంటే చంద్రబాబు ఎటువంటి మేకప్ లేకుండా రోజుకో వేషం కడుతున్నారని అంబటి రాంబాబు అన్నారు. పాత మిత్రులు దూరం కావడంతో కొత్త మిత్రుల కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెసుతో కలిసి పనిచేస్తానని తాజాగా చెబుతున్నారని ఆయన అన్నారు.

వారికి ఇప్పుడర్థమైంది...

వారికి ఇప్పుడర్థమైంది...

బిజెపి నేత రామ్ మాధవ్‌కు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌కు చంద్రబాబుకు ఇప్పుడు అర్థమైందని అంబటి రాంబాబు అన్నారు. బిజెపితో కుమ్మక్కయ్యారని తమ పార్టీపై టిడిపి నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఫ్రంట్ కడుదామని మొదట బిజెపి తమ వద్దకే వచ్చిందని చెప్పారు. తాము నిరాకరించడం వల్లనే టీడిపితో కలిసిందని అన్నారు.

చర్చ జరగకుండా బిజెపి...

చర్చ జరగకుండా బిజెపి...

అవిశ్వాసంపై చర్చ జరగనివ్వకుండా బిజెపి ప్రయత్నిస్తోందని అంబటి రాంబాబు విమర్శించారు. చర్చ జరిగితే దేశ ప్రజలకు ఏపికి జరిగిన అన్యాయం తెలుస్తుందని అన్నారు. హోదా సాధన కోసమే కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+