బాబుకు షాక్: 'ఖర్చుల మేర రాని పెట్టుబడులు, ఆ కంపెనీలపై దాడులు'
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వైసిపి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు షాకిచ్చారు. కనీసం దారి ఖర్చుల మేర కూడా పెట్టుబడులు రాలేదని ఎద్దేవా చేశారు.
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వైసిపి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు షాకిచ్చారు. కనీసం దారి ఖర్చుల మేర కూడా పెట్టుబడులు రాలేదని ఎద్దేవా చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడేళ్లుగా చేసిన విదేశీ పర్యటనల వల్ల కనీసం ఆయన దారి ఖర్చుల మేరకు కూడా పెట్టుబడులు రాలేదని ఆశ్చర్యకరమైన కామెంట్లు చేశారు.

అలాంటి దౌర్భాగ్య పరిస్థితిలో ప్రస్తుతం ఏపీ ఉందని అంబటి వ్యాఖ్యానించారు. అమెరికాలోని ఐటీ కంపెనీలపై యూఎస్ఐసీఎస్ అనే ప్రభుత్వ సంస్థ దాడులు చేసి, వారి ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకుందన్నారు. ఇప్పుడు ఆ కంపెనీలే చంద్రబాబుతో ఎంవోయులు కుదుర్చుకోవడానికి వచ్చాయని అంబటి విమర్శించారు.












Click it and Unblock the Notifications