'రోజాను అడ్డుకోవడమే నిదర్శనం, కన్నీళ్లు పెట్టినా పట్టించుకోరా'
తమ పార్టీ ఎమ్మెల్యో రోజాను జాతీయ మహిళా పార్లమెంటు సదస్సులో పాల్గొనకుండా అడ్డుకోవడం సరికాదని, ప్రతిపక్షం పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కక్ష కట్టారని వైసిపి నేత అంబటి రాంబాబు
విజయవాడ: తమ పార్టీ ఎమ్మెల్యో రోజాను జాతీయ మహిళా పార్లమెంటు సదస్సులో పాల్గొనకుండా అడ్డుకోవడం సరికాదని, ప్రతిపక్షం పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కక్ష కట్టారని వైసిపి నేత అంబటి రాంబాబు మంగళవారం మండిపడ్డారు.
ప్రతిపక్షం పైన కక్ష కట్టారని చెప్పడానికి జాతీయ మహిళా పార్లమెంటు సదస్సులో పాల్గొనకుండా రోజాను అడ్డుకోవడమే మంచి నిదర్శనం అన్నారు. సదస్సుకు ఆహ్వానించి ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు.
మీరు తప్పు చేస్తే తప్పని కూడా చెప్పకూడదా అని నిలదీశారు. తెలుగుదేశం పార్టీ హయాంలో మహిళలకు అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నాయని అంబటి రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

మంత్రి తనను వేధిస్తున్నారని జెడ్పీ చైర్ పర్సన్ కన్నీళ్లు పెట్టినా పట్టించుకోరా అని అడిగారు. మీ అరాచకాలను ఎవరూ పట్టించుకోవద్దా, మీకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే అమ్ముడు పోయినట్టా అన్నారు.
మీడియా మీకు అమ్ముడు పోలేదని అక్కసు వెళ్లగక్కుతున్నారని ధ్వజమెత్తారు. ప్రచారం కోసం చంద్రబాబు పాకులాడుతున్నారన్నారు. పత్రికల పైన ఆయన మాట్లాడిన తీరు సరికాదన్నారు. దేశంలో ఏ వ్యవస్థనైనా భ్రష్టు పట్టించగల నాయకుడు చంద్రబాబు అన్నారు.












Click it and Unblock the Notifications