వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోనసీమ అల్లర్లలో పవన్ కు ప్రమేయం - అది చరిత్రాత్మక తప్పిదం : మంత్రి అంబటి..!!

|
Google Oneindia TeluguNews

కోనసీమ అల్లర్లలో పవన్‌కళ్యాణ్‌కూ ప్రమేయం ఉందంటూ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేసారు. మంత్రి - ఎమ్మెల్యే ఇంటికి ని ప్పు పెడితే ఎందుకు ఖండించలేదని నిలదీసారు. బస్సు యాత్రను ప్రశ్నిస్తున్న పవన్.. టీడీపీ మహానాడును ఎందుకు ప్రశ్నించలేదంటూ మంత్రి దుయ్యబట్టారు. పవన్‌కళ్యాణ్‌ నిజంగా ఒక రాజకీయ నాయకుడేనా అంటూ నిలదీసారు.

నిజానికి చంద్రబాబు అధికారం నుంచి దిగిపోయే సమయానికి ఎన్ని వేల కోట్లు అప్పులు పెట్టారు... ఎంత మందికి ఎగ్గొట్టారు... అన్ని అప్పులు పెట్టినాయన, అన్ని ఎగ్గొట్టిన ఆయన ఇవాళ నీతులు చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. ఆయన పదవి నుంచి దిగిపోయే సమయానికి ఎంత మేర బకాయిలు పెట్టిందీ రాంబాబు వివరించారు

చంద్రబాబు పెండింగ్ బిల్లులు చెల్లిస్తున్నాం

చంద్రబాబు పెండింగ్ బిల్లులు చెల్లిస్తున్నాం

వర్కుల బిల్లుల పెండింగ్‌ రూ.40,000 కోట్లు ఉన్నాయని.. విద్యుత్‌ డిస్కంలకు రూ.20,000 కోట్లు చెల్లించాల్సి ఉందని.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.1880 కోట్లు బకాయి ఉన్నారంటూ ఇతర లెక్కలను చెప్పుకొచ్చారు. రైతుల విద్యుత్ సబ్సిడీ బకాయిలే తొమ్మది వేల కోట్లు ఉన్నాయని చెప్పారు. ఇన్ని బకాయిలు వదిలిపెట్టి పోతే, సీఎం జగన్‌ అన్నీ తీర్చారని చెప్పారు. దివాళా తీసిన ప్రభుత్వాన్ని చంద్రబాబు తమకు అప్పగించారని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో ఆర్దిక వ్యవస్థ అతలా కుతలం చేసారని మండిపడ్డారు. అదే విధంగా.. చంద్రబాబు ఏపీ బ్రాండ్‌ను దెబ్బ తీసారంటూ ఫైర్ అయ్యారు. మూడేళ్ల నుంచి ఎంతో చక్కని పాలన అందిస్తున్న ప్రభుత్వం తమదని రాంబాబు చెప్పారు.

కష్ట సమయంలోనూ సంక్షేమం ఇచ్చాం

కష్ట సమయంలోనూ సంక్షేమం ఇచ్చాం

ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వం తమదని చెప్పుకొచ్చారు. కేవలం బకాయిలు తీర్చడమే కాకుండా, కరోనా సంక్షోభంలో కూడా సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అమలు చేసి, ప్రజలకు అండగా తమ ప్రభుత్వం నిలిచిందన్నారు. దాదాపు రూ.1.43 లక్షల కోట్లు నేరుగా ప్రజల ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వంగా చెప్పుకొచ్చారు. చంద్రబాబుకు ధైర్యం ఉంటే వచ్చే ఎన్నికల్లో సింగిల్‌గా బరిలోకి దిగుతామని..వాళ్లకు ఎవరి మద్దతు అవసరం లేదని..సింగిల్‌గా పోటీ చేస్తామని దమ్ము, ధైర్యం ఉంటే ఆ మాట చెప్పాలని సవాల్ చేసారు. పోలవరం ప్రాజెక్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఉన్న ప్రాజెక్టని చెబుతూ..వారు డబ్బులు ఇవ్వాలని.. ప్రభుత్వం పనులు చేయాలని స్పష్టం చేసారు.

పోలవరంలో చంద్రబాబు తప్పు చేసారు

పోలవరంలో చంద్రబాబు తప్పు చేసారు


డయాఫ్రమ్‌ వాల్‌ గురించి ఆయన మాట్లాడుతూ, రివర్స్‌ టెండరింగ్‌ వల్లనే అది కొట్టుకుపోయిందని ఆరోపించారు. చివరకు మహానాడులో కూడా అదే మాట్లాడారు. అది పెద్ద అబద్దమని చెప్పారు. ఏకంగా రూ.400 కోట్లతో డయాఫ్రమ్‌ వాల్‌ కట్టిన చంద్రబాబు, కాఫర్‌డ్యామ్‌లు పూర్తి చేయకుండా ఆ పని చేశారన్నారు. నిజానికి ఇదే విదేశాల్లో అయితే అంత తప్పు చేసిన వారిని ఉరి వేసేవారంటూ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు.

English summary
Minister Ambait Rambabu slams TDP Chanra Babu on Polavaram and PAwan Kalyan on Konseema Issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X