Ambati Rayudu : సీఎం జగన్ చెప్పారు, సూపర్ - అదే చేస్తున్నా..!!
అంబటి రాయుడు ప్రజల మధ్యకు వచ్చారు. క్రికెట్ గ్రౌండ్ వీడిన రాయుడు ఇప్పుడు పొలిటికల్ గ్రౌండ్ లో దిగేందుకు సిద్దమయ్యారు. వరుసగా అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పిన అంబటి రాయుడు తాజాగా ఐపీఎల్ లో సీఎస్కే టీం నుంచి బయటకు వచ్చేసారు. ఐపీఎల్ ఆడుతున్న సమయంలోనే అంబటి రాయుడు రాజకీయ ఎంట్రీ గురించి చర్చ మొదలైంది. వైసీపీలో చేరటం ఖాయమనే ప్రచారం సాగింది. ఇప్పుడు అంబటి రాయుడు తాజా అడుగులు ఆసక్తి కరంగా మారుతున్నాయి.
ప్రజల మధ్యన అంబటి రాయుడు : క్రికెటర్ అంబటి రాయుడు నిత్యం ప్రజల మధ్యనే ఉంటున్నారు. ఐపీఎల్ ముగిసిన వెంటనే ప్రజల్లోకి రావాలని రాయుడే ముందే డిసైడ్ అయ్యారు. ఏపీలో వైసీపీ పాలన..సీఎం జగన్ నిర్ణయాలను అంబటి రాయుడు సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు గుప్పించారు. పలు సందర్భాల్లో సీఎం జగన్ ను కలిసారు.

తన క్రికెట్ కెరీర్ లో ప్రపంచ కప్ ను తనను ఎంపిక చేయకపోవటం పైన నాటి సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ పైన రాయుడు సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆ తరువాత ఎమ్మెస్కే నాడు చోటు చేసుకున్న పరిణామాలను వివరించారు. ఇక, సీఎస్కే ఐపీఎల్ విజేత అయిన తరువాత తమ టీం మేనేజ్ మెంట్ తో కలిసిన అంబటి రాయుడు సీఎం జగన్ ను కలిసారు.
జగన్ పథకాలకు ప్రశంసలు : అంబటి రాయుడు వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం కొనసాగింది. దానిని రాయుడు ఖండించారు. కానీ, తాను రాజకీయాల్లోకి రావటం ఖాయమని రాయుడు ప్రకటించారు. ప్రజానాడి తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నానని చెప్పుకొచ్చారు. తాజాగా రాయుడు గుంటూరు జిల్లా తెనాలి రూరల్ ప్రాంతంలో పర్యటించారు. రైతు బరోసా కేంద్రంలో రైతులతో ముచ్చటించారు.
అనంతరం శాలివాహన సంఘ సభ్యులతో కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇక.. మధ్యాహ్నం భోజనం తర్వాత జిల్లా పరిషత్ హైస్కూల్‌కు వెళ్లి అక్కడి వసతులను పరిశీలించారు. విద్యార్థులతో ముచ్చటించారు. తన సొంత జిల్లాలో అన్ని ప్రాంతాలు తిరిగి సమస్యలు తెలుసుకుంటున్నట్లు రాయుడు వెల్లడించారు.

రాజకీయాల్లోకి ఎంట్రీపై క్లారిటీ : ప్రభుత్వం నుంచి రైతులకు మద్దతు ఉందని రాయుడు చెప్పుకొచ్చారు. రైతు భరోసా కేంద్రాల పని తీరును ప్రశంసించారు. విద్యారంగంలో ఏపీ ప్రభుత్వం మంచి మార్పులు తీసుకొచ్చిందని అభినందించారు. ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందుతున్నాయని కితాబిచ్చారు. సీఎం జగన్ అమలు చేస్తున్న పథకాలను రాయుడు ప్రశంసలతో ముంచెత్తారు.
తాను సీఎం జగన్ తో కలిసిన సమయంలో క్రీడలకు సంబంధించన చర్చే జరిగిందన్నారు. స్పోర్ట్స్ అకాడమీలు ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారని వెల్లడించారు. తనకు ప్రజా సేవ చేయాలని ఉందని..తన కుటుంబ వారసత్వంగా వస్తున్న సేవను కొనసాగిస్తానని స్పష్టం చేసారు. దీని ద్వారా తన రాజకీయ ఎంట్రీ ఏ పార్టీ నుంచే అంబటి చెప్పకనే చెప్పేసారు.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications