వంద మంది రాజారెడ్డిలు కలిస్తే జగన్ - అంబటి : అందుకే నా పదవి తీసేసారు - కన్నా..!!

పల్నాడు రాజకీయంలో ఇప్పుడు మంత్రి అంబటి వర్సస్ కన్నాగా మారుతున్నాయి. సత్తెనపల్లి నుంచి టీటీడీ అభ్యర్ధిగా కన్న పోటీ చేయటం ఖాయమైంది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. జగన్ గురించి తెలిసిన కన్నా ఆయన ప్రాపకం కోసం ఏం చేసారో వివరించారు. అటు కన్నా సైతం తాను జగన్ ను విమర్శించినందుకే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించే కుట్ర చేసారని ఆరోపించారు.

అంబటి కీలక వ్యాఖ్యలు:టీడీపీ నేత కన్నా ఆరోపణలపై మంత్రి అంబటి సీరియస్ గా స్పందించారు. అవును..వంద మంది రాజారెడ్డిలు కలిస్తే ఒక జగన్మోహన్ రెడ్డి అవుతారని వ్యాఖ్యానించారు. రాజారెడ్డి ఏమైనా విలనా..ఆయన రాష్ట్రాినికి రాజశేఖర రెడ్డి, జగన్ ను అందించారని అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు.

Ambati Rmababu comments gores viral on Raja Reddy, Kanna targets on Mudragada on Kapu Issues

జగన్ గురించి ముందే తెలిసిన కన్నా గతంలో ఆయన ప్రాపకం కోసం 500 కార్లతో ర్యాలీగా బయల్దేరి, చివరకు గుండెనొప్పి వచ్చిందంటూ ఎందుకు నాటకాలాడారో చెప్పాలని డిమాండ్ చేసారు. బీజేపీ ఎన్నికల డబ్బు మింగేసిన కన్నాకు తనను, ముఖ్యమంత్రిని విమర్శించే నైతిక అర్హత లేదన్నారు. సత్తెనపల్లి నుంచి కన్నా చివరకు పోటీ చేస్తారో..పారిపోతారో తెలియదన్నారు. తాను చంద్రబాబు కాదని.. వైఎస్సార్ శిష్యుడనని పేర్కొన్నారు.

జగన్ ను ప్రశ్నించినందుకే:తాను పుట్టింది రేపల్లెలో..చచ్చేది సత్తెనపల్లిలో అని మంత్రి అంబటి కీలక వ్యాఖ్యలు చేసారు. అటు కన్నా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. జగన్ అరాచకాలను ప్రశ్నించినందుకే తనను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి దించాలని కుట్ర పన్నారని వ్యాఖ్యానించారు.

Ambati Rmababu comments gores viral on Raja Reddy, Kanna targets on Mudragada on Kapu Issues

ఎన్నికల ఫండ్ దుర్వినియోగం చేసారని నిరాధార ఆరోపణలు చేసారని వివరించారు. తన పై బురద జల్లేందుకే అలాంటి వ్యాఖ్యలు చేసారని వివరించారు. వైసీపీ పాలన అంతం చేయటానికే తాను టీటీడీలో చేరానని కన్నా చెప్పుకొచ్చారు. మంత్రి అంబటి చేసిన ఆరోపణలను ఖండించారు. ముద్రగడ ఏం చేసినా వ్యక్తిగత ప్రాబల్యం కోసమే చేస్తారని కన్నా ఆరోపించారు.

ముద్రగడపై కన్నా ఫైర్:ముద్రగడ పద్మనాభం రాజకీయ ప్రాబల్యం తగ్గిపోతోందని భావించినప్పుడు హడావుడి చేస్తారని కన్నా విమర్శించారు. కాపులకు మేలు చేసిన చంద్రబాబుకు ఎప్పుడైనా కృతజ్ఞతలు చెప్పారా అని ప్రశ్నించారు. కాపులకు రిజర్వేషన్ ప్రక్రియ చేపట్టింది చంద్రబాబు అని చెప్పుకొచ్చారు.

కాపులకు రిజర్వేషన్ ఇవ్వనని గోదావరి జిల్లాల్లోనే జగన్ చెప్పిన అంశాన్ని గుర్తు చేసారు. కాపుల కోసం ఒక్క పథకం అయినా అమలు చేసారా అంటూ కన్నా నిలదీసారు. జగన్ సీఎం అయిన తరువా చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఈడబ్ల్యూఎస్ కోటాలో కాపులకు అయిదు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని లేఖ రాసినా పట్టించుకోలేదని కన్నా లక్ష్మీనారాయణ వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+