50 లక్షలు ఇవ్వకపోతే చంపేస్తాం: 'అంబికా' డైరెక్టర్‌కు నకిలీ నక్సలైట్ల బెదిరింపులు

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో శుక్రవారం నకలీ నక్సలైట్లు కలకలం రేపారు. అంబికా దర్బారు బత్తితో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అంబికా గ్రూప్ సంస్ధల డైరెక్టర్ అంబికా ప్రసాద్‌ను నకిలీ నక్సలైట్లు బెదిరించారు.

ఆయనకు ఫోన్ చేసి బెదిరించిన నకిలీ నక్సలైట్లు తమకు వెంటనే రూ. 50 లక్షలు ఇవ్వాలని లేకుంటే హతమారుస్తామని డిమాండ్ చేసినట్లుగా పోలీసులు వెల్లిడించారు. ఈ విషయాన్ని వెంటనే ఆయన పోలీసులకు చేరవేయగా, వెంటనే స్పందించిన పోలీసులు నకిలీ నక్సలైట్లను అరెస్ట్ చేశారు.

 Ambika Prasad got threatening call from fake naxals

వారి వద్ద నుంచి ఓ కారుతో పాటు తుపాకిని కూడా స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

తనిఖీల్లో నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు

తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరులో పోలీసులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నలుగురు వ్యక్తులను అదుపులోకి చేశారు. వారి వద్ద నుంచి భారీగా నల్లమందు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

నల్లమందు అక్రమ రవాణా కింద వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులు విశాఖపట్నం జిల్లా చింతపల్లి వాసులని పోలీసులు వెల్లడించారు. పట్టబడిన నల్లమందు విలువ రూ. 2.40 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు

కడప జిల్లా రాజంపేటలో ఇద్దరు దొంగలను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 7.5 లక్షలు విలువ చేసే నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Sudo naxals warned Ambika group director Ambika Prasad and demanded money in eluru on friday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి