విశాఖ ఐటీ హబ్! పెట్టుబడులకు అమెరికా సంస్థలు
హైదరాబాద్: అమెరికాకు చెందిన ఐటీ సంస్థలు విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఏపీకి పెట్టుబడులు ఆహ్వానించేందుకు ఇటీవల ఐటీ శాఖ ప్రతినిధి బృందం అమెరికాలో పర్యటించింది. అమెరికాకు చెందిన ఫార్చ్యూన్ సంస్థ పెట్టుబడులు పెట్టే విషయమై పలు దఫాలుగా వీరితో చర్చలు జరిపింది.
అమెరికాలోని 48 ఐటీ సంస్థలతో ఆంధ్రప్రదేశ్ ఐటీ ప్రతినిధులు చర్చలు జరిపారు. ఐటీ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం చ్పట్టే చర్యలు, విధానాలను వారు వివరించారు. పెట్టుబడులు పెడితే ఇచ్చే రాయితీల పైన కూడా వారికి ఐటీ ప్రతినిధులు తెలిపారు.
దీంతో అమెరికా సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే, చాలా సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నప్పటికీ.. ఒప్పందం తర్వాతే కంపెనీల పేర్లు వెల్లడించనున్నారు.

సింగపూర్ మాజీ ప్రధాని లీకున్ యూ మృతికి శాసన సభ సంతాపం
సింగపూర్ మాజీ ప్రధానమంత్రి లీకున్ యూ మృతికి తెలంగాణ శాసన సభ సంతాపం తెలిపారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. కాంగ్రెస్, బిజెపి సభ్యులు సంతాపానికి మద్దతు తెలుపుతూ లీకున్ యూ గురించి ప్రసంగించారు. ఆధునిక సింగపూర్ రూపశిల్పిగా లీకున్ యూ దక్షిణాసియాకే ఆదర్శంగా నిలిచిన పాలకుడు అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా సంతాపం తెలిపారు.












Click it and Unblock the Notifications