హైదరాబాద్‌లో అమెరికన్ స్పైన్ అండ్ పెయిన్ సెంటర్(పిక్చర్స్)
హైదరాబాద్: ఇంటర్వేన్షనల్ స్పైన్ మేనేజ్‌మెంట్ విభాగంలో అమెరికన్ ఫెలోషిప్ సాధించిన ఏడుగురు తెలుగు ఫిజీషియన్లు కలిసి స్థాపించిన అమెరికన్ స్పైన్ అండ్ పెయిన్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
‘ఇంటర్వేన్షనల్ స్పైన్ అండ్ పెయిన్ చికిత్సలో సంయుక్తంగా 50 సంవత్సరాల అనుభవమున్న వైద్యులు ఇక్కడ అందుబాటులో ఉంటారు. శస్త్ర చికిత్సలు, మత్తు మందులు అవసరం లేకుండా రోగి వ్యక్తిగత అవసరాల మేరకు చికిత్సను అందించడం తమ లక్ష్యం. ఆస్పత్రిలో దీర్ఘకాలం పాటు ఉండే అవసరం కూడా ఉండదు. దీనివల్ల ఖర్చులు సైతం తగ్గుతాయి' అని డాక్టర్ మహేంద్ర సనపాటి, ప్రెసిడెంట్ అండ్ మెడికల్ డైరెక్టర్, సీఈఓ, అడ్వాన్స్డ్ అమ్బులేటరి సర్జరీ సెంటర్, ఇవాన్స్ విల్లె, యూఎస్ఏ, డాక్టర్ ప్రభావ తెల్లా, మెడికల్ డైరెక్టర్, సీఈఓ, ఇంటర్వేన్షనల్ పెయిన్సోలుషన్స్, డల్లాస్లు తెలిపారు.
ప్రతి రోగికీ వినూత్న రీతిలో వ్యక్తిగత చికిత్సలు తమ ప్రత్యేకతగా వారు వివరించారు. అందుకోసం అత్యాధునిక పద్ధతులు పాటించనున్నట్టు తెలిపారు. తమ డాక్టర్లు వెన్నునొప్పి, కాలునొప్పి,
నరాల్లో బాధ, శస్త్ర చికిత్స తర్వాత వచ్చే నొప్పి, విపరీతమైన తలనొప్పి, క్యాన్సర్ నొప్పి, భుజాలు,
మోకాళ్ళలో నొప్పులు, సయాటికా, స్పైనల్ స్టెనోసిస్, కీళ్ళ అమరికలోపాలు, గాయాలు తదితరాలను
ఆపరేషన్ లేకుండా నయం చేసే నైపుణ్యాన్నికలిగి ఉన్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ సునీత, డైరెక్టర్, కార్పొరేట్ కమ్యూనికెషన్, డాక్టర్ వీణా బసవ, డైరెక్టర్ ,ఆఫ్ ఫైనాన్స్, డాక్టర్ పార్వతి, సెంటర్ డైరెక్టర్, డాక్టర్ శ్రీనాధ వాట్టం, డాక్టర్ రేఖాగల్లా, డాక్టర్ గురుశెట్టి తదితరులు పాల్గొన్నారు.

అమెరికన్ స్పైన్ అండ్ పెయిన్ సెంటర్స్
ఇంటర్వేన్షనల్ స్పైన్ మేనేజ్‌మెంట్ విభాగంలో అమెరికన్ ఫెలోషిప్ సాధించిన ఏడుగురు తెలుగు ఫిజీషియన్లు కలిసి స్థాపించిన అమెరికన్ స్పైన్ అండ్ పెయిన్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది.

అమెరికన్ స్పైన్ అండ్ పెయిన్ సెంటర్స్
అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

అమెరికన్ స్పైన్ అండ్ పెయిన్ సెంటర్స్
ఇంటర్వేన్షనల్ స్పైన్ అండ్ పెయిన్ చికిత్సలో సంయుక్తంగా 50 సంవత్సరాల అనుభవమున్న వైద్యులు ఇక్కడ అందుబాటులో ఉంటారు.

అమెరికన్ స్పైన్ అండ్ పెయిన్ సెంటర్స్
శస్త్ర చికిత్సలు, మత్తు మందులు అవసరం లేకుండా రోగి వ్యక్తిగత అవసరాల మేరకు చికిత్సను అందించడం తమ లక్ష్యం. ఆస్పత్రిలో దీర్ఘకాలం పాటు ఉండే అవసరం కూడా ఉండదు. దీనివల్ల ఖర్చులు సైతం తగ్గుతాయని డాక్టర్లు చెప్పారు.












Click it and Unblock the Notifications