టీడీపీ ఆఫీసులపై దాడులు- విపక్షాల ఖండన-కేంద్రం జోక్యం ఉంటుందా ? రాష్ట్రపతి పాలన చర్చ
ఏపీలో టీడీపీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు సాగించిన దాడుల్ని అన్ని విపక్షాలు తప్పుబడుతున్నాయి. ఇప్పటికే టీడీపీతో పాటు బీజేపీ, జనసేన కూడా ఈ దాడుల్ని ఖండించాయి. టీడీపీ అయితే మరో అడుగు ముందుకేసి ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని తొలిసారిగా డిమాండ్ చేసింది. పవన్ కళ్యాణ్ కూడా కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. దీంతో ఈ దాడులకు సంబంధించి ఇప్పుడు కేంద్రం ఏం చేయబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.
టీడీపీ ఆఫీసులపై దాడులు
ఏపీలో టీడీపీ నేత పట్టాభి సీఎం జగన్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలతో నిన్న వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంతో పాటు జిల్లాల్లోని పలు టీడీపీ కార్యాలయాల్ని టార్గెట్ చేస్తూ దాడులకు దిగాయి. ఇందులో భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. పలు చోట్ల వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య పరస్పర దాడులతో ఇరు పార్టీల నేతలకూ గాయాలయ్యాయి.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలోకి వైసీపీ శ్రేణలు వచ్చిన విధానం చూస్తే పక్కా ప్లాన్ తోనే దాడులకు దిగినట్లు అర్ధమవుతోంది. అదీ రాష్ట్ర డీజీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న టీడీపీ ఆఫీసుపై దాడులు జరుగుతున్నా పోలీసులు జోక్యం చేసుకోకపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది.

దాడుల్ని ఖండించిన విపక్షాలు
ఏపీలో టీడీపీ ఆఫీసులపై వైసీపీ శ్రేణులు సాగించిన భౌతిక దాడుల్ని టీడీపీతో పాటు బీజేపీ, జనసేన పార్టీలు కూడా ఖండించాయి. దాడులు జరిగిన కొద్ది సేపటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ సునీల్ దియోధర్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. టీడీపీ ఆఫీసులపై దాడులకు వైసీపీ శ్రేణులు తెగబడిన విధానంపైనా నేతలు మండిపడ్డారు. దీనిపై వెంటనే పోలీసులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో కేంద్రం జోక్యం కూడా కోరారు.

జగన్ సర్కార్ స్పందించాలన్న సోము
ప్రజాస్వామ్యంలో దాడులు సరికాదని, ఇలాంటి ఘటనలు విషాదకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. పార్టీ కార్యాలయాలపై ఇలాంటి దుశ్చర్యలను ఏపీ బీజేపీ ఖండిస్తోందని సోము పేర్కొన్నారు. ఇలాంటి దమనకాండకు పాల్పడిన వారిపై వైఎస్ జగన్ సర్కార్ కఠిన చర్యలకు ఉపక్రమించి ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాలని బీజేపీ డిమాండ్ చేస్తోందని సోము వీర్రాజు తెలిపారు. ఇప్పటివరకూ టీడీపీ అంటేనే మండిపడుతున్న సోము వీర్రాజు.. తాజా ఘటనలపై మాత్రం దీటుగానే స్పందించారు.
కేంద్రం జోక్యం కోరిన పవన్ కళ్యాణ్
ఏపీలో టీడీపీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు చేసిన దాడుల్ని జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా తీవ్రంగా తప్పుబట్టారు.గతంలో ఏపీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మొట్టమొదటిసారి పార్టీ ఆఫీసులపైవి దాడులు జరిగాయని పవన్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదన్నారు. వ్యక్తిగత దాడులు, పార్టీ ఆఫీసులు, నేతలపై దాడులు జరిగితే అరాచకం, దౌర్జన్యానికి దారి తీస్తుందని పవన్ హెచ్చరించారు. దీనిపై కేంద్ర హోంశాఖతో పాటు ఏపీ పోలీసు అధికారులు కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. దోషుల్ని పట్టుకుని శిక్షించకపోతే రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతుందని పవన్ హెచ్చరించారు.

తొలిసారి రాష్ట్రపతి పాలన కోరిన చంద్రబాబు
టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడులపై తీవ్రంగా స్పందించిన చంద్రబాబు.. రాష్ట్రంలో వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. గతంలో ఎప్పుడూ రాష్ట్రపతి పాలన కోరని చంద్రబాబు.. తొలిసారి ఈ ఘటనపై రాష్ట్రపతి పాలన కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది. దాడుల సమాచారం తెలియగానే కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసిన చంద్రబాబు.. వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని ఆ తర్వాత ప్రెస్ మీట్లో డిమాండ్ చేశారు. డీజీపీ కార్యాలయం పక్కేనే ఉన్న టీడీపీ కేంద్ర కార్యాలయానికే భద్రత లేకపోతే ఇక ఎవరికి భద్రత కల్పిస్తారని పోలీసుల్ని ప్రశ్నించారు.
Recommended Video

కేంద్రం జోక్యం చేసుకుంటుందా?
ఏపీలో టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడులపై టీడీపీతో పాటు బీజేపీ, జనసేన నేతలు కూడా ఖండన ప్రకటనలు చేశారు. టీడీపీ రాష్ట్రపిత పాలన కోరితే, పవన్ కళ్యాణ్ కేంద్రం జోక్యం కోరారు. బీజేపీ నేతలు మాత్రం దాడుల ఖండనలకే పరిమితం అయ్యారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంటుందా లేదా అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.
రాజకీయ పార్టీ కార్యాలయాలపై దాడుల నేపథ్యంలో ఏపీ డీజీపీకి కేంద్ర హోంశాఖ నుంచి ఆదేశాలు ఇచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అసాంఘిక శక్తుల చర్యల్ని ఉపేక్షించవద్దని మాత్రం చెప్పే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. రాష్ట్రపతి పాలన డిమాండ్ పై మాత్రం కేంద్రం స్పందించే అవకాశాలు లేవని తెలుస్తోంది.
ఎందుకంటే ప్రస్తుత రాజకీయ పరిస్ధితుల్లో కేంద్రానికి వైసీపీ బేషరతుగా మద్దతిస్తుండటం, టీడీపీతో ఉన్న సంబంధాలు వంటి అంశాల్ని పరిగణనలోకి తీసుకుంటే మాత్రం రాష్ట్రపతి పాలన డిమాండ్ ను కేంద్రం లైట్ తీసుకునే అవకాశముంది.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications