Pawan Kalyan: చంద్రబాబు కేబినెట్లో పవన్ పాత్ర ఇదే ! అమిత్ షా, చిరంజీవి లీక్..!
ఏపీలో ఇవాళ ఎన్డీయే కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయగా.. అనంతరం మంత్రులుగా పవన కళ్యాణ్ తో పాటు పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు. ఆ తర్వాత మంత్రులకు కేటాయించే శాఖలపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఇవాళ సాయంత్రానికి దీనిపై క్లారిటీ వస్తుందని భావిస్తున్న తరుణంలో చంద్రబాబు కేబినెట్లో పవన్ కళ్యాణ్ పాత్రపై అమిత్ షా, చిరంజీవి లీక్ ఇచ్చారు.
Congratulations to Andhra Pradesh Chief Minister Shri @ncbn Ji, Deputy Chief Minister Shri @PawanKalyan Ji, and all others who took the oath of office today. It is my firm belief that the NDA government will pivot the state of Andhra Pradesh to new heights of prosperity,… pic.twitter.com/r4yJKJa6rY
— Amit Shah (@AmitShah) June 12, 2024
"ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరియు నేడు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారందరికీ నా అభినందనలు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరుస్తూ ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందని నేను విశ్వసిస్తున్నాను." అంటూ అమిత్ షా ట్వీట్ చేశారు. ఇందులో ఆయన పవన్ ను డిప్యూటీ సీఎంగానే పేర్కొన్నారు.

అనంతరం పవన్ కళ్యాణ్ సోదరుడు చిరంజీవి కూడా ఇదే తరహాలో ట్వీట్ చేశారు. చిరు తన ట్వీట్ లో "ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగో సారి ప్రమాణస్వీకారం చేసిన నారా చంద్రబాబునాయుడు గారికి, డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ గారికి, మిగతా మంత్రి వర్గానికి హార్దిక శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి కి అహర్నిశం పాటుపడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను....ఆశిస్తున్నాను.!!" అంటూ పేర్కొన్నారు. తద్వారా శాఖల కేటాయింపుకు ముందే అమిత్ షాతో పాటు చిరంజీవి కూడా పవన్ ను డిప్యూటీ సీఎం అని లీక్ ఇచ్చినట్లయింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగో సారి ప్రమాణస్వీకారం చేసిన @ncbn
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 12, 2024
నారా చంద్రబాబునాయుడు గారికి,
డిప్యూటీ సి ఎం @PawanKalyan కొణిదల పవన్ కళ్యాణ్ గారికి, మిగతా మంత్రి వర్గానికి హార్దిక శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి కి అహర్నిశం పాటుపడే అవకాశాన్ని సద్వినియోగం…
-
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
ఉస్తాద్‌కు బిగ్ షాక్...తొలి రోజే ఆన్లైన్లో HD ప్రింట్ ప్రత్యక్షం! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!!












Click it and Unblock the Notifications