• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

విజయసాయిరెడ్డికి అమిత్ షా క్లాస్: ఏం మాట్లాడాలో తెలియదా..ఏంటిది : టీడీపీతో నేతల సమక్షంలో..!

|

వైసీపీ సీనియర్ నేత పార్లమెంటరీ పార్టీ చీఫ్ విజయ సాయిరెడ్డి ఊహించని ఘటన ఎదురైంది. జగన్ ప్రస్తావన తెచ్చి తన విధేయత చాటుకొనే ప్రయత్నం..కేంద్ర పెద్దలకు ఆగ్రహం తెప్పించింది. కేంద్రం స్పందించాల్సిన అంశం పైన..సంబంధంలేని అంశాల పైన మీరెలా మాట్లాడుతారంటూ హోం మంత్రి అమిత్ షా తో సహా..పలు పార్టీల సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేసారు. మీ జోక్యం అవసరమా అంటూ అమిత్ షా అందరి సమక్షంలోనే విజయసాయి రెడ్డికి క్లాస్ తీసుకున్నారు. జగన్ ప్రస్తావన అవసరమా అంటూ నిలదీసారు. టీడీపీతో సహా 37 పార్టీల నేతల సమక్షంలో ఈ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అయితే, విజయ సాయిరెడ్డి తాను లేవనెత్తిన అభ్యంతరాలనే బయటకు వచ్చి చెప్పగా..అమిత్ షా తో సహా ఇతర పక్ష నేతలు ఏ విధంగా విజయ సాయిరెడ్డి మీద స్పందించిందీ టీడీపీ రాజ్యసభ సభ్యులు బయటకు వెల్లడించారు. దీంతో..ఇప్పుడు ఢిల్లీకి చేరుకున్న ఏపీ పార్లమెంట్ సభ్యుల్లో హాట్ టాపిక్ గా మారింది.

పవన్ కల్యాణ్ డెంగ్యూ, చికెన్ గున్యా దోమలాంటివాడు... విజయసాయిరెడ్డి సెటైర్లు

అజాద్ ప్రతపాదన పైన స్పందన

అజాద్ ప్రతపాదన పైన స్పందన

పార్లమెంట్ సమావేశాల ప్రారంభం ముందు కేంద్రం అఖిలపక్షం నిర్వహించింది. అందులో కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ గ్రుహ నిర్బంధంలో ఉన్న ఫరూక్ అబ్దుల్లా ను పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రస్తావించారు. అదే సమయంలో రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ జ్యూడిషియల్ రిమాండ్ లో ఉన్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కు సైతం అవకాశం కల్పించాలని కేంద్రానికి సూచించారు. గతంలో..ఇలా అనేక మంది పార్లమెంట్ కు ప్రత్యేక అనుమతితో హాజరయ్యారని కేంద్రానికి వివరించారు. గతంలో కేసులున్న వారు ఏ రకంగా పార్లమెంట్ సమాశాలకు హాజరైందీ.. అప్పటి ప్రభుత్వాలు ఏ రకంగా అవకాశం కల్పించిందీ ఆజాద్ అఖిలపక్షంలో చెప్పుకొచ్చారు.

సాయిరెడ్డి జోక్యం..జగన్ ప్రస్తావన

సాయిరెడ్డి జోక్యం..జగన్ ప్రస్తావన

ఇదే సమయంలో విజయ సాయిరెడ్డి జోక్యం చేసుకున్నారు. కాంగ్రెస్‌ ద్వంద ప్రమాణాలు పాటిస్తున్నదని విమర్శించారు. తమ నేత జగన్‌ ఎంపీగా ఉన్నప్పుడే జైలులో ఉన్నారని, అప్పటి యూపీఏ ప్రభుత్వం ఆయనకు బెయిలు రాకుండా చేసిందని విమర్శించారు. 16 నెలలు అక్రమంగా జైళ్లో పెట్టారని గుర్తు చేసారు. దీంతో ఒక్కసారిగా.. కాంగ్రెస్..సీపీఎం.. ఆర్ఎస్పీ..జమ్ము కాశ్మీర్ ఎంపీ..వైకో వంటి వారంతా విజయ సాయిరెడ్డి వ్యాఖ్యలను తప్పు బట్టారు. సాయిరెడ్డి చేసిన వాదనను తిప్పి కొట్టారు. అఖిలపక్షంలో అనేక అభిప్రాయాలు వస్తాయని..కేంద్రం స్పందించాల్సి ఉంటుందని..మీరు ఎందుకు అవసరం లేని అంశాల ను ప్రస్తావిస్తారంటూ వారంతా సాయి రెడ్డి జోక్యాన్ని తప్పుబట్టారు.

 అమిత్ షా ఆగ్రహం..మీ జోక్యం ఎందుకు

అమిత్ షా ఆగ్రహం..మీ జోక్యం ఎందుకు

ఇంతలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. జగన్‌ అంశం ఇక్కడ అప్రస్తుతం. జగన్‌ ఇప్పుడు ఎంపీ కాదుకదా! ఆయన ప్రస్తావనెందుకు? ఎక్కడ, ఏ సందర్భంలో.. ఏ అంశం మాట్లాడాలో తెలియకపోతే ఎలా అంటూప్రశ్నించినట్లు సమాచారం. కాంగ్రెస్ తమ వాదన చెప్పింది.. దానికి ప్రభుత్వం అవునని..కాదని చెప్పలేదు.. మధ్యలో మీ జోక్యం ఎందుకు అంటూ ప్రశ్నించారు. సంబంధం లేని అంవఆల పైన మీరెందుకు స్పందిస్తున్నారని అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేసారు. సాయిరెడ్డి దీనికి కొనసాగింపుగా ఏదో చెప్పే ప్రయత్నం చేయగా మిగిలిన పార్టీల నేతలు అడ్డుకున్నారు. దీంతో..ఇప్పుడు ఈ వ్యవహారం పార్లమెంట్ సమావేశాల ముందు పొలిటికల్ సర్కిల్స్ హాట్ చర్చకు కారణంగా నిలిచింది.

English summary
Central Home minister Amith Shah serious on YCP floor leader Vijaya Sai Reddy in All party meeting which arraned on parliament winter sessions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X