Cockroach is Back: వెనక్కి తగ్గని బొద్దింక..! కొత్త అకౌంట్ తో సరికొత్తగా టార్చర్..!

కొన్ని రోజుల క్రితం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలతో నొచ్చుకున్న ఈ దేశంలో నిరుద్యోగ యువత ను ఆకర్షించేందుకు ఆన్ లైన్ లో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta party) నాలుగు రోజుల వ్యవధిలోనే 10 మిలియన్ల మంది ఫాలోయర్లను ఇన్ స్టాలో సంపాదించింది. సీజేపీ అజెండాకు ఆకర్షితులైన యువత పెద్ద ఎత్తున ఆ పార్టీని ఫాలో కావడం ప్రారంభించారు. దీంతో ఇవాళ ప్రపంచంలో అతిపెద్ద ఫాలోయర్ల పార్టీగా చెప్పుకునే బీజేపీని దాటిపోయింది. దీంతో సీజేపీ ఖాతాను కేంద్రం ఎక్స్ లో బ్లాక్ చేయించింది. దీంతో మరో అకౌంట్ ఓపెన్ చేసి సీజేపీ కౌంటర్ ఇచ్చింది.

BJP కి షాకిచ్చిన కాక్‌రోచ్ జనతా పార్టీ.. 4 రోజుల్లోనే అతి పెద్ద పార్టీగా రికార్డ్
BJP కి షాకిచ్చిన కాక్‌రోచ్ జనతా పార్టీ.. 4 రోజుల్లోనే అతి పెద్ద పార్టీగా రికార్డ్

కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఉన్న ఖాతాను ఎక్స్ బ్లాక్ చేయడంతో దాని స్ధానంలో కాక్రోచ్ ఈజ్ బ్యాక్ (Cockroach is back) పేరుతో మరో అకౌంట్ ఓపెన్ చేసిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే (Abhijeet Dipke) దాన్ని ఎక్స్ లో షేర్ చేశారు. మా నుంచి తప్పించుకుందామనుకున్నారు కదూ అంటూ ఇందులో ఓ పంచ్ కూడా వేశారు. అంతకు ముందు ఎక్స్ తమ ఖాతాను బ్లాక్ చేస్తుందని ముందే ఊహించామన్నారు. ఇవాళ కొత్త ఖాతాలో పెట్టిన మరో పోస్టులో బీజేపీ ఫాలోయర్లను తాము దాటేయడమే బ్లాక్ వెనుక ఉన్న కారణమని తెలిపారు.

Blocked But Not Silenced Cockroach Janta Party Returns to X Within Hours Taunts Critics
CJP: కాక్రోచ్ జనతా పార్టీకి కేంద్రం షాక్..! బీజేపీ రికార్డు బద్దలు కొట్టగానే..!
CJP: కాక్రోచ్ జనతా పార్టీకి కేంద్రం షాక్..! బీజేపీ రికార్డు బద్దలు కొట్టగానే..!

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో 'బొద్దింక జనతా పార్టీ' అనూహ్యంగా విజృంభిస్తున్న తరుణంలో ఇవాళ అనూహ్యంగా ఆ పార్టీ ఎక్స్ అకౌంట్ బ్లాక్ అయింది. దీంతో దీని వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కేకు పలు సలహాలు ఇస్తూ పోస్టులు వెలిశాయి. ఇప్పటికే నిరుద్యోగం, పరీక్ష పత్రాల లీకులు, రాజకీయ చర్చలు, సంస్థాగత జవాబుదారీతనం వంటి అంశాలపై యువతలో నెలకొన్న అసంతృప్తితో, కొద్ది రోజుల క్రితం ఒక ఆన్‌లైన్ వ్యంగ్య ఉద్యమంగా ప్రారంభమైన ఈ పార్టీ.. ఇప్పుడు పూర్తిస్థాయి డిజిటల్ రూపాంతరం చెందింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+