భానుడి భగభగల వేళ ఈదురు గాలులతో వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!!

తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిగా మారాయి. రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పలు ప్రాంతాల్లో నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ సమయంలో నే వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈదురు గాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అటు ఎండలు.. ఇటు వర్షాలతో విచిత్ర వాతావరణ పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలి అని వాతావరణ శాఖ సూచించింది. పలు జిల్లాలకు అలర్ట్స్ జారీ చేసింది.

ఏపీ, తెలంగాణలో ఎండలు ప్రచండంగా మారాయి. నాలుగు రోజులుగా వాతావరణం పూర్తిగా మారి పోయింది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చేరుకుంటున్నాయి. ఈ సమయంలో వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. రాబోయే 3-4 రోజులలో నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కొమరిన్ ప్రాంతం, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన భాగాలు, తూర్పు-మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలలోకి మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఉత్తర తెలంగాణ వరకు కొనసాగిన ఉపరితల ద్రోణి ఈరోజు తూర్పు ఉత్తరప్రదేశ్ నుండి ఝార్ఖండ్ ఉత్తర చత్తీస్ ఘడ్ ల మీదుగా అంతర్గత ఒడిస్సా, మీదుగా ఒడిస్సా కోస్తా తీరం వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కి మీ ఎత్తులో కొనసాగుతోంది.

బయటకు రావద్దు, 50 డిగ్రీలకు ఉష్ణోగ్రత - ఈ జిల్లాల్లో మంటలే.. తాజా హెచ్చరిక..!!
బయటకు రావద్దు, 50 డిగ్రీలకు ఉష్ణోగ్రత - ఈ జిల్లాల్లో మంటలే.. తాజా హెచ్చరిక..!!
imd-latest-alerts-over-rains-in-many-parts-of-ap-and-telangana-for-next-two-days-amid-record-temper

ఈ జిల్లాలకు తాజా అలర్ట్స్

బంగాళాఖాతం వరకు కొనసాగుతున్న ద్రోణి ఈరోజు మధ్య బంగాళాఖాతం, నైరుతి బంగాళాఖాతం మీదుగా తమిళనాడు వరకు సగటు సముద్రమట్టం నుండి 3.1 నుండి 4.5 కి మీ ఎత్తులో కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో.. రానున్న రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. జిల్లాలలో ఉరుములు మెరుపులు, 40 నుండి 50 కి మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఈరోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని ఉత్తర - తూర్పు జిల్లాలలో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఇక.. శుక్రవారం, శనివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుముల తో కూడిన జల్లులు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముందని అధికారులు వెల్లడించారు. తీవ్ర వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది. బలమైన గాలులు గరిష్టముగా గంటకు 50-60 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముందని వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+