ఇండియాలో చివరి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?

పర్వతాలు, ఎడారులు, దట్టమైన అడవులు, రాష్ట్రాల సరిహద్దులను దాటుకుంటూ దేశంలోని నలుమూలలను అనుసంధానించే ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ లలో భారతీయ రైల్వే ఒకటి. అయితే నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రైలు మార్గాలకు దూరంగా భారత రైలు ప్రయాణానికి ముగింపు పలికే ఒక చివరి రైల్వే స్టేషన్ నిశ్శబ్ధంగా వేచి ఉంది. అదే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్న సింఘాబాద్ రైల్వే స్టేషన్. ఇక్కడికి చేరుకునే పర్యాటకులకు ఎలాంటి ఆర్భాటాలు, భారీ సైన్ బోర్డులు కనిపించవు. కేవలం భౌగోళిక సరిహద్దుల వద్ద నిశ్శబ్దంగా ఆగిపోయే రైలు పట్టాలు మాత్రమే దర్శనమిస్తాయి. భారతీయ రైల్వేల పరిధి ఎక్కడితో ముగుస్తుందో చెప్పడానికి ఈ ప్రదేశమే ఒక సజీవ సాక్ష్యం.

32 ఏళ్ల వయసు.. ఇప్పటికీ నేను వర్జిన్‌నే: బిగ్ బాస్ బ్యూటీ
32 ఏళ్ల వయసు.. ఇప్పటికీ నేను వర్జిన్‌నే: బిగ్ బాస్ బ్యూటీ

సింఘాబాద్ రైల్వే స్టేషన్ పశ్చిమ బెంగాల్లోని మాల్డా జిల్లాలో భారత్-బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దుకు అతి సమీపంలో ఉంది. ఇది భారత తూర్పు రైల్వే నెట్వర్క్ చివరి అంచున ఉంటుంది. ఈ పాయింట్ దాటిన తర్వాత భారతీయ రైల్వే పట్టాలు విదేశీ భూభాగంలోకి(బంగ్లాదేశ్) ప్రవేశిస్తాయి. అందువల్ల ఈ దిశలో భారతీయ రైల్వే మ్యాప్‌లో సింఘాబాద్‌ను చివరి స్టాప్‌గా పరిగణిస్తారు. చుట్టూ గ్రామీణ వాతావరణం, ప్రశాంతమైన నివాసాల మధ్య ఉండే ఈ స్టేషన్‌లో సాధారణ ప్రయాణికుల రద్దీ చాలా తక్కువగా ఉంటుంది. దీని ప్రాధాన్యత వాణిజ్యపరమైనది కాకపోయినా, భౌగోళికంగా, వ్యూహాత్మకంగా దేశంలోనే అత్యంత కీలకమైనది.

Which is Last Railway Station of India Know History and Location of Singhabad Station Full Details

ఈ సింఘాబాద్ స్టేషన్ చరిత్ర బ్రిటిష్ కాలం నాటి వలసరాజ్యాల పాలనకు ముడిపడి ఉంది. అప్పట్లో బెంగాల్ ప్రాంతాన్ని, ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉన్న ప్రాంతాలతో అనుసంధానించడానికి ఈ రైలు మార్గాన్ని నిర్మించారు. 1947లో దేశ విభజన తర్వాత ఈ మార్గం ఒక అంతర్జాతీయ సరిహద్దు క్రాసింగ్‌గా రూపాంతరం చెందింది. చాలా సంవత్సరాల పాటు భారత్-బంగ్లాదేశ్ మధ్య వస్తువుల రవాణాకు ఇది ప్రధాన రవాణా కేంద్రంగా పనిచేసింది. ఈ కారిడార్ ద్వారా రాతి చిప్స్, ఇతర ముడి సరుకులను ఇరు దేశాల మధ్య రవాణా చేసేవారు. కాలక్రమేణా ప్యాసింజర్ రైళ్ల రాకపోకలు తగ్గినప్పటికీ.. రెండు దేశాల మధ్య కుదిరిన రైల్వే ఒప్పందాల వల్ల దీని ప్రాధాన్యత అలాగే ఉంది.

IND vs AFG: అందుకే షమీని ఎంపిక చేయలేదు: అజిత్ అగార్కర్
IND vs AFG: అందుకే షమీని ఎంపిక చేయలేదు: అజిత్ అగార్కర్

సాధారణ రైల్వే జంక్షన్లతో పోలిస్తే సింఘాబాద్ స్టేషన్‌కు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. బంగ్లాదేశ్ సరిహద్దుకు ముందు భారతదేశపు తూర్పు రైల్వే చివరి పాయింట్ కావడంతో పాటు, ఇరు దేశాల రైల్వే కనెక్టివిటీకి ఇది వ్యూహాత్మక చిహ్నం. అంతేకాకుండా, ఇక్కడికి పర్యాటకులు చాలా అరుదుగా వస్తుండటం వల్ల ఈ ప్రాంతం తన సహజసిద్ధమైన, ప్రశాంతమైన వాతావరణాన్ని కాపాడుకోగలిగింది. ప్రస్తుతం ఈ స్టేషన్ పనిచేస్తున్నప్పటికీ.. దీని కార్యకలాపాలు ఎక్కువగా అధికారిక, పరిమిత సరుకు రవాణాకే పరిమితమయ్యాయి. సరిహద్దు ప్రాంతం కావడం వల్ల ప్యాసింజర్ రైళ్లు చాలా అరుదుగా నడుస్తాయి. అయినప్పటికీ రైల్వే ప్రేమికులకు, భౌగోళికాంశాలపై ఆసక్తి ఉన్నవారికి సింఘాబాద్ ఒక అద్భుతమైన ప్రదేశం అనడంలో సందేహం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+