చంద్రబాబు చాలు, కొత్త వాళ్లు అవసరం లేదు: జగన్‌కు అమిత్ షా షాక్
తెలుగుదేశం పార్టీతో తమ స్నేహం కొనసాగుతుందని బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా శనివారం స్పష్టం చేశారు. ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు.
న్యూఢిల్లీ/అమరావతి: తెలుగుదేశం పార్టీతో తమ స్నేహం కొనసాగుతుందని బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా శనివారం స్పష్టం చేశారు. ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు.

కొత్త స్నేహితుల ప్రస్తావన.. జగన్‌కు షాక్
టిడిపితో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని అమిత్ షా పేర్కొన్నారు. కొత్త స్నేహితుల ప్రస్తావన అవసరం లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి అన్నారు. బిజెపితో వైసిపి పొత్తు అంశంపై వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

తెలంగాణలో మాత్రం
కొత్త స్నేహితుల వార్తలను తాము ఖండిస్తున్నట్లు అమిత్ షా తెలిపారు. తెలంగాణలో మాత్రం ఒంటరిగానే పోరాడుతామని తేల్చి చెప్పారు. కొన్ని పార్టీలే కాదు దేశం మొత్తం బిజెపితో టచ్‌లో ఉందని ఆయన పేర్కొన్నారు.

జగన్ ఆరాటానికి అమిత్ షా చెక్! బాబుకు ఊరట
ఎన్డీయే నుంచి టిడిపిని తప్పించి, తాను బిజెపితో పొత్తుతో ముందుకు వెళ్లాలని జగన్ ఉబలాటపడుతున్నట్లు టిడిపి చాలా రోజులుగా విమర్శలు చేస్తోన్న విషయం తెలిసిందే. జగన్ తీరు కూడా అలాగే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అమిత్ షా వ్యాఖ్యలు జగన్‌కు షాక్ అని చెప్పవచ్చు. అలాగే వైసిపి ప్రయత్నాలకు ఇక చెక్ పడుతుందని భావిస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబుకు ఊరట కలిగించే విషయం.

మారుతున్న స్థానిక నేతల వైఖరి
వైసిపితో పొత్తు విషయంలోను ఏపీ బిజెపి నేతల మాటల్లో మార్పు కనిపిస్తున్నట్లుగా ఉంది. వైసిపితో పొత్తు ప్రసక్తే లేదని మాజీ కేంద్రమంత్రి, బిజెపి నేత పురంధేశ్వరి చెప్పారు. అయితే, సోము వీర్రాజు మాత్రం తన మాటల దాడిని కొనసాగిస్తున్నారు.

సోము వీర్రాజు హెచ్చరికలు
కాకినాడ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల అంశంపై వీర్రాజు మాట్లాడారు. టిడిపి మిత్ర ధర్మాన్ని పాటించడం లేదని ఆరోపించారు. ఈ అంశాన్ని తాము పొత్తు విషయంలో పరిగణలోకి తీసుకుంటామని టిడిపికి హెచ్చరికలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications