AP News: రాజమండ్రిలో దారుణం.. యాంకర్ పై దాడి..!
యాంకర్ పై దాడి జరిగిన ఘటన రాజమండ్రిలో జరిగింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. కావ్య శ్రీ అనే మహిళ ఈవెంట్ యాంకర్ గా చేస్తున్నారు. ఆమె తండ్రి ఆమెతో ఈవెంట్ కు వెళ్తుంటారు. ఈ క్రమంలో వారిద్దరిపై నల్లూరు శ్రీనివాస్ అనే వ్యక్తి దాడి చేసి గాయపరిచాడు. కావ్య శ్రీ తండ్రి రాజమండ్రికి చెందిన నల్లూరు శ్రీనివాస్ కు డబ్బు అప్పుగా ఇచ్చారు. అయితే ఎన్ని డబ్బులు అడిగినా లేవాంటూ.. కాలం వెళ్లదిస్తున్నాడు. అయితే కావ్య శ్రీకి కొనసీమలో ఓ ఈవెంట్ ఉండగా తండ్రితో పాటు వచ్చింది.
నల్లూరు శ్రీనివాస్ ను డబ్బులు అడగాలని ఇంటికి వెళ్లారు. డబ్బులు ఇవ్వాలని అతన్ని కోరారు. ఈ క్రమంలో వారి మధ్య మాటామాట పెరిగింది. శ్రీనివాస్ కావ్య శ్రీ తండ్రిపై చేయి చేసుకున్నాడు. పిడిగుద్దుదలు కురిపించాడు. దుర్బాషలాడుతూ కొట్టాడు. అడ్డుకోబోయిన కావ్యశ్రీ పై కూడా దాడి చేశారు. దాడిలో కావ్య శ్రీ కన్నుకు గాయం అయింది. దీంతో వారు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తనను శ్రీనివాస్ తీవ్రంగా కొట్టాడని.. ఆడ పిల్లను అని కూడా చూడకుండా దాడి చేశాడని కావ్య శ్రీ వాపోయింది.

దాడిని వీడియో తీస్తున్నా.. కొట్టాడని చెప్పింది. అతను మాజీ ఎంపీ అనుచరుడు అని ఆమె ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన నుంచి మహిళలపై దాడులు పెరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం సరుకులు తీసుకొస్తున్న మహిళ సంచిని లాక్కునే ప్రయత్నం చేశాడు ఓ వ్యక్తి. ఆమె బ్యాగ్ వదిలిపెట్టకపోవడంతో రాయితో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. మహిళ కేకేలు పెట్టడంతో స్థానికులు అతన్ని పట్టుకుని కొట్టారు. మహిళలపై దాడులు పెరగడం ఆందోళన వ్యక్తం అవుతోంది.
తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా మనపాడు మండలం చిన్న పోతుల పాడు గ్రామంలో మహిళపై సల సల కాగుతున్న నూనెను పోశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications