ఏపీలో యూపీ ఫార్ములా: అడ్డొస్తే బుల్‌డోజర్లే: అమరావతిలో కూల్చివేతలు
Chandrababu Naidu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సారథ్యంలో ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ ఫార్ములాను అనుసరిస్తోన్నట్లు కనిపిస్తోంది. నేరాలు, ఆకృత్యాలకు పాల్పడిన వారి ఇళ్లను యోగి ఆదిత్యనాథ్ సర్కార్ బుల్‌డోజర్లతో కూల్చివేసినట్టే ఏపీలో అక్రమ నిర్మాణాలపై కూటమి ప్రభుత్వం కొరడా ఝుళిపించడం మొదలుపెట్టింది.
తాజాగా- రాజధాని అమరావతి పరిధిలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని చంద్రబాబు ప్రభుత్వం కూల్చివేసింది. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న పార్టీ కార్యాలయం ఇది. రెండు ఎకరాల విస్తీర్ణంలో ఇది నిర్మితమౌతోంది. దీన్ని సీఆర్డీఏ అధికారులు కూల్చివేస్తోన్నారు. ఈ భవన నిర్మాణంలో అనేక ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయని సీఆర్డీఏ అధికారులు స్పష్టం చేస్తోన్నారు.

ఈ తెల్లవారుజామున సుమారు 5:30 గంటల సమయంలో కూల్చివేత పనులు మొదలయ్యాయి. భారీ బుల్‌డోజర్లు, ప్రొక్లెయినర్లతో కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ముందుజాగ్రత్త చర్యగా పోలీసులను సంఘటన స్థలం వద్ద మోహరింపజేశారు.
ఇది అక్రమ నిర్మాణం అంటూ ఇటీవలే సీఆర్డీఏ అధికారులు వైఎస్ఆర్సీపీ అగ్ర నాయకత్వానికి నోటీసులు జారీ చేశారు కూడా. కూల్చివేయాంటూ ఆదేశించారు. ఈ నోటీసులపై శుక్రవారం వైఎస్ఆర్సీపీ నాయకులు హైకోర్టను ఆశ్రయించారు. పిటీషన్లను దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు.. వారికి అనుకూలంగా ఆదేశాలు ఇచ్చింది.
తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూల్చివేత.
— Jagananna Connects (@JaganannaCNCTS) June 22, 2024
ఉదయం 5:30 గంటల సమయంలో కూల్చివేత ప్రారంభం.
పొక్లైన్లు, బుల్‌డోజర్లతో భవనం కూల్చివేత. శ్లాబ్‌కు సిద్ధంగా ఉన్న భవనాన్ని కూల్చివేస్తున్న అధికారులు.
కూల్చివేతకు సీఆర్డీయే ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్‌ను సవాల్… pic.twitter.com/yW0w8EavdY
సీఆర్డీఏ పరిధిలో ఎలాంటి కూల్చివేత పనులు చేపట్టకూడదంటూ హైకోర్డు ఉత్తర్వులు జారీ చేసినట్లు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి చెబుతున్నారు. సీఆర్డీఏ కమిషనర్‌కు కూడా తమ న్యాయవాది ద్వారా ఈ విషయాన్ని తెలియజేశామని, అయినప్పటికీ హుటాహుటిన బుల్‌డోజర్లు, ప్రొక్లెయినర్లతో కూల్చివేత పనులు చేపట్టారని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications