ఆనం కు సీటుపై టీడీపీ కొత్త ట్విస్ట్ - ఏం జరుగుతోంది..!!

వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం టీడీపీలోకి ఎంట్రీ ఖాయమైనట్లు కనిపిస్తోందది. వైసీపీ నాయకత్వం పైన విమర్శలతో ఆనం ను పార్టీ పక్కన పెట్టింది. ఆనం ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి నియోజకవర్గ బాధ్యత లను నేదురుమల్లి రాం కుమార్ రెడ్డికి అప్పగించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఆనం టీడీపీకి అనుకూలంగా ఓటు వేసారంటూ పార్టీ నుంచి వైసీపీ సస్పెండ్ చేసింది. ఇదే సమయంలో ఆనం అధికారికంగా టీడీపీ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కానీ, సీటు విషయంలో మాత్రం కొత్త ట్విస్ట్ తెర మీదకు వచ్చింది.

ఆనం కీలక అడుగులు: నెల్లూరు జిల్లాలో ఆనం రామనారాయణ రెడ్డి సీనియర్ పొలిటీషియన్. కాంగ్రెస్, టీడీపీలో పని చేసిన ఆనం 2019 ఎన్నికల్లో వైసీపీలో చేరారు. జగన్ అడిగితేనే తాను వైసీపీలో చేరానని తాజాగా ఆనం ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ప్రభుత్వ నిర్ణయాలను ఓపెన్ గా విమర్శించిన ఆనం పైన పార్టీ చర్యలు తీసుకుంది. ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో రాం కుమార్ రెడ్డికి బాధ్యతలు కేటాయించింది. జిల్లాలో ప్రస్తుతం ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీ రెబల్స్ గా ఉన్నారు. అందులో ఆనం, కోటంరెడ్డి ఇద్దరూ టీడీపీలో చేరటం ఖాయమైందనే ప్రచారం సాగుతోంది. మహానాడు ఇందుకు ముహూర్తంగా చెబుతున్నారు. ఈ ఇద్దరి నేతలకు టీడీపీ నుంచి భవిష్యత్ పైన హామీ ఉందని తెలుస్తోంది.

Anam Rama Narayana Reddy

టీడీపీ లో హామీ దక్కిందా: నెల్లూరు రూరల్ నియోజవకర్గం నుంచి కోటంరెడ్డికి దాదాపుగా టీడీపీ టికెట్ ఖాయమని తెలుస్తోంది. ఇక, సీనియర్ నేత ఆనం విషయంలో మాత్రం టీడీపీలో కొత్త చర్చ మొదలైంది. ఆనం వచ్చే ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గం ఆత్మకూరు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. కానీ, టీడీపీ నుంచి ఆత్మకూరు సీటు విషయంలో హామీ రావటం లేదని తెలుస్తోంది. ఆనం ను నెల్లూరు ఎంపీగా పోటీ చేయాలని టీడీపీ సూచించినట్లు విశ్వసనీయ సమాచారం. ఆనం ఎంపీగా పోటీ చేస్తే ఆయన కుమార్తెకు ఆత్మకూరు సీటు ఇస్తామని ప్రతిపాదించినట్లు చెబుతున్నారు. ఆత్మకూరులో లో తన కుమార్తెను దింపి..ఎంపీగా పోటీ చేయాలనే ప్రతిపాదన ఆనం ముందు టీడీపీ నేతలు ఫ్రతిపాదించటంతో ఈ ప్రతిపాదన పైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Anam Rama Narayana Reddy

2024లో పోటీ ఎక్కడ: నెల్లూరు జిల్లాలో ప్రతీ నియోజకవర్గంలో ఆనంకు రాజకీయంగా మంచి సంబంధాలు ఉన్నాయి. ఆనం కుమార్తె కైవల్యా రెడ్డి కడప జిల్లా బద్వేలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ కోడలు. గత మహానాడు సమయంలో నే కైవల్యా రెడ్డి టీడీపీ నేత నారా లోకేష్ ను కలిసారు. నెల్లూరు ఎంపీగా ఇప్పుడు టీడీపీకి ఆనం సరైన ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. 2019 లో టీడీపీ నుంచి పోటీ చేసిన బీదా మస్తాన రావు ప్రస్తుతం వైసీపీలో చేరారు. అదే విధంగా వైసీపీ నుంచి గెలిచిన ప్రస్తుత ఎంపీ ఆదాల ప్రభాకర రెడ్డి వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేయనున్నారు. వైసీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి లోక్ సభ బరిలో దిగే అవకాశం ఉండటంతో టీడీపీ ఆనం వైపు చూస్తోంది. దీంతో..ఇప్పుడు నెల్లూరు రాజకీయాల్లో టీడీపీ - వైసీపీ మధ్య రాజకీయంగా కొత్త వ్యూహాలు అమలవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+