జగన్ పార్టీతో మంతనాలు, ఆనం వివేకా పార్టీ మారడంపై రామనారాయణ ఆగ్రహం
ఆనం వివేకానంద రెడ్డి పార్టీ మారుతారంటూ వస్తున్న ప్రచారంపై మాజీ మంత్రి, టిడిపి నేత ఆనం రామనారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన బుధవారం పత్రికల్లో వచ్చిన కథనాలపై స్పందించారు.
నెల్లూరు: ఆనం వివేకానంద రెడ్డి పార్టీ మారుతారంటూ వస్తున్న ప్రచారంపై మాజీ మంత్రి, టిడిపి నేత ఆనం రామనారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన బుధవారం పత్రికల్లో వచ్చిన కథనాలపై స్పందించారు.
పత్రికల్లో, మీడియాల్లో వచ్చిన కథనాలను ఆయన తీవ్రంగా ఖండించారు. టిడిపి జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ బీద రవిచంద్రతో కలిసి విలేకరులతో మాట్లాడారు. మూడ్రోజులుగా పత్రికల్లో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయన్నారు.

చంద్రబాబు నాయకత్వంలోనే..
ఆనం కుటుంబం చంద్రబాబు నాయకత్వంలో పని చేస్తుందని, టిడిపిలో కొనసాగుతుందని స్పష్టం చేశారు. పత్రికల్లో వచ్చిన ఏ వార్తలకు ఆధారాలు లేవన్నారు. నిరాధారమైన ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు.

వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తెచ్చేందుకు..
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు తనతో పాటు తన కుటుంబ సభ్యులు పని చేస్తారన్నారు. టిడిపి తమకు కొత్త కాదని, బహుశా కొంతమందికి కొత్త కావొచ్చునని విమర్శించారు.

టిడిపిని వీడేది లేదు
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించేందుకు అందరితో కలిసి పని చేసేందుకు పూర్తిస్థాయిలో కృషి చేస్తామన్నారు. తెలుగుదేశం పార్టీని తామెవ్వరం వీడమని తేల్చి చెప్పారు.

ఊహాగానాలు
కాగా, ఆనం వివేకానంద రెడ్డి తెలుగుదేశం పార్టీని వీడుతారని, వైసిపి నేతలు ఆయనతో చర్చలు జరుగుతున్నాయని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. భూమన కరుణాకర్ రెడ్డి ఆయనతో ఫోన్లో మంతనాలు జరిపినట్లుగా ప్రచారం జరిగింది. దీనిని ఆనం రామనారాయణ కొట్టి పారేశారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications