అంతా వట్టిదే కానీ: జగన్‌తో ఆనం భేటీపై వివేకా కుమారుడి స్పందన
నెల్లూరు: తమ కుటుంబం తెలుగుదేశం పార్టీని వీడుతోందని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తోందని అసత్య ప్రచారం సాగుతోందని, అదంతా వట్టిదేనని ఆనం వివేకానంద రెడ్డి తనయుడు ఆనం రంగమయూర్ రెడ్డి అన్నారు. వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డితో మాట్లాడినట్లుగా వస్తున్న పుకార్లు అవాస్తవమని చెప్పారు.
జగన్‌తో తాము ఎవరం కూడా టచ్‌లో లేమని తేల్చి చెప్పారు. తమ కుటుంబంలో ఒకరికి ఎమ్మెల్యే, మరొకరికి మేయర్ పదవులు ఇస్తారంటూ ప్రచారం సాగుతోందని, కానీ అందులో వాస్తవం లేదని తేల్చి చెప్పారు. తమకు పార్టీ మారే ఆలోచన లేదని చెప్పారు.

అయినప్పటికీ తమ ఆత్మీయులతో భేటీ అయ్యాక, ముందస్తుగా నిర్ణయాన్ని వెల్లడించి తుది అడుగు వేస్తామని ఆయన చెప్పారు. కొద్ది రోజుల క్రితం ఆనం.. జగన్‌తో భేటీ అయ్యారన్నది వాస్తవం కాదన్నారు.












Click it and Unblock the Notifications