పిచ్చికుక్క దారికి రాకపోతే ఏం చేస్తాం, కాల్చి పారేస్తాం: జగన్‌పై ఆనం వివేకా

నెల్లూరు/ విజయవాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నేత ఆనం వివేకానంద రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ చర్యలను రాష్ట్రం భరించలేకపోతున్నదంటూ "దణ్ణం పెడతా జగన్... మళ్ళీ జైలుకెళ్లు ప్లీజ్" అని విజ్ఞప్తి చేశారు.

పిచ్చికుక్కను ఊరిమీదకు వదిలేసినట్లు జగన్ ప్రవర్తిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పిచ్చికుక్క దారికి రాకపోతే ఏం చేస్తామని ప్రశ్నిస్తూ... కాల్చి పడేస్తామని అన్నారు. జగన్ ప్రవర్తనతో తెలుగువారందరికీ చెడ్డపేరు వస్తోందని ఆయన అన్నారు. జగన్‌ని మళ్ళీ రాజకీయాల్లోకి అడుగుపెట్టనివ్వకూడదని ప్రజలకు పిలుపునిచ్చారు. జగన్‌లాంటి వ్యక్తులను ప్రజలు ప్రోత్సహించకూడదని, జగన్‌ను అదుపు చేసి వ్యవస్థను కాపాడాలని అన్నారు.

అందరి తల్లులు తమ పిల్లల్ని ఉగ్గుపాలు పోసి పెంచితే వైఎస్ విజయమ్మ మాత్రం జగన్‌ను జిల్లేడు పాలు పోసి పెంచిందని ఆనం వివేకానందారెడ్డి అన్నారు. అందుకే జగన్ విష సర్పంలా తయారయ్యాడని ఆయన అన్నారు. గనులు, భూములను దోచుకున్న వారినే జగన్‌ రాజకీయ నాయకులుగా తయారు చేశారు.

ఏ-2ను పార్లమెంట్‌కు పంపిన ఘనత జగన్‌దేనని ఆయన విజయసాయిరెడ్డికి రాజ్యసభ టికెట్ ఇవ్వడంపై అన్నారు. వీలుంటే ఏ-3ని ఐక్యరాజ్య సమితికి కూడా జగన్ పంపుతాడని ఆయన అన్నారు. తమ కులాన్ని జగన్ నాశనం పట్టించాడని ఆనం వివేకానందారెడ్డి మండిపడ్డారు.

ఇదిలావుంటే, పెద్దలంటే జగన్‌కు గౌరవం లేదని ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ అన్నారు. చంద్రబాబు అంటే జగన్‌కు అసూయ, ద్వేషం ఉందని ఆయన అన్నారు. జగన్ సీఎం కాలేకపోయానన్న అక్కసుతోనే చంద్రబాబుపై ఇష్టంవచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. జగన్‌ తీరు నచ్చకే 19 మంది ఎమ్మెల్యేలు బయటికి వచ్చారని ఆయన అన్నారు. వైఎస్‌ కూడా ఇలా ఎప్పుడూ మాట్లాడలేదని జలీల్‌ఖాన్‌ అన్నారు.

Anam Viveka compares YS Jagan as stray dog

చంద్రబాబుపై జగన్‌ చేసిన వ్యాఖ్యలను ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. దీనికి 2019లో జగన్‌కు ప్రజలు బుద్ది చెప్తారని ఆయన అన్నారు. రైతు రుణమాఫీ అసాధ్యమని జగన్‌ ఆరోపించారు. కాని టీడీపీ ప్రభుత్వం రుణమాఫీ చేసి చూపించిందని మంత్రి పల్లె అన్నారు.

ఏపీ సీఎం చంద్రబాబు భద్రత గురించి వైసీపీ నేత జగన్‌కు ఎందుకని తెలుగుదేశం పా్రటీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. జగన్ చంద్రబాబుపై కుట్ర ఆలోచన చేస్తున్నారా? అని బుచ్చయ్య ప్రశ్నించారు. చంద్రబాబుపై బాంబుదాడి కేసు నిందితుడైన గంగిరెడ్డితో జగన్‌కు సంబంధాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఎర్రచందనం స్మగ్లర్లకు జగన్ బెయిల్ ఇప్పిస్తున్నారని బుచ్చయ్య చౌదరి ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+