టీడీపీ 'ఆకర్ష్' ఇప్పట్లో ఆగేలా లేదు: 'మరో 10 మంది చేరేందుకు సిద్ధం'
అమరావతి: ఏపీలో అధికార పార్టీ తెలుగుదేశం చేపట్టిన 'ఆపరేషన్ ఆకర్ష్' ఇప్పట్లో ముగిసేలా లేదు. నెల్లూరు జిల్లాకు తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ లీడర్ ఆనం వివేకానందరెడ్డి వ్యాఖ్యలే ఇందుకు నిదర్శంగా కనిపిస్తున్నాయి. మంగళవారం ఆయన నెల్లూరు పట్టణంలో విలేకరులతో మాట్లాడారు.
త్వరలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో పది మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. వైయస్ జగన్ తీరు నచ్చకే ఎమ్మెల్యేలు వైసీపీని వీడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. జగన్‌కు ఒక పద్ధతి, విదానం లేకపోవడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు విసిగిపోతున్నారని అన్నారు.

వైసీపీ అధినేత వైయస్ జగన్ మానసికి స్థితి బాగుండాలని అధికారపక్షం కోరుకుంటోందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా సాధించే విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. తమ నాయకుడు, సీఎం చంద్రబాబు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని ఆనం పేర్కొన్నారు.
కాగా, టీడీపీ చేపట్టిన 'ఆపరేషన్ ఆకర్ష్'లో భాగంగా వైసీపీ టికెట్‌పై గెలిచిన 17 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు.












Click it and Unblock the Notifications