తెలుగువాడి మీసంకట్టులో ఆత్మగౌరవం: ఆనం వివేకా

హైదరాబాద్: తెలుగువాడి మీసం కట్టులో, రోషంలో ఆత్మగౌరవం ఉందని, ఆ ఆత్మగౌరవం కోసం పార్టీలను పక్కన పెట్టి సమైక్యాంధ్ర కోసం కలిసికట్టుగా పోరాటం చేయాలని కాంగ్రెసు సీమాంధ్ర శానసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి అన్నారు. సీమాంధ్ర ప్రజలు భవిష్యత్తును ఫణంగా పెట్టి ఉద్యమిస్తున్నారని, అందువల్ల రాజకీయాలు పక్కన పెట్టి నాయకులు ఐక్యంగా ముందుకు రావాలని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

రాజకీయ పార్టీల నాయకులు పరస్పరం బురద చల్లుకోకుండా ఐకాసను ఏర్పాటు చేసుకుని సమైక్యాంధ్ర కోసం ఒకే వేదిక మీదికి రావాలని ఆయన పిలుపునిచ్చారు. రథయాత్రలు మానుకోవాలని ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి అన్నారు. అద్వానీలాంటి జాతీయ నాయకుడు కూడా విభజన విషయంలో పునరాలోచనలో పడ్డారని ఆయన అన్నారు.

Anam Vivekananda Reddy

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సమైక్యాంధ్రను కోరుకుంటున్నారని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా సమైక్యాంధ్రనే వాంఛిస్తోందని, చంద్రబాబు మాత్రం జై సమైక్యాంధ్ర అని అనలేదని ఆయన అన్నారు. చంద్రబాబు ఆత్మగౌవరం అంటూ రథయాత్రలు చేస్తున్నారని, డ్రామాలు మానేద్దామని చంద్రబాబును కోరుతున్నానని ఆయన అన్నారు.

తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడడానికి పార్టీలను పక్కన పెట్టి అందరం కలుద్దామని ఆయన అన్నారు. తెలంగాణ రాజకీయ నాయకులు ఒక్కటైనట్లు, సీమాంధ్ర నాయకులమంతా ఏకమై ప్రధాని మన్మోహన్ సింగ్‌ను, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి విభజన వద్దని కోరుతామని ఆయన అన్నారు. సమైక్యాంధ్ర జెఎసి పిలుపు మేరకే తాము శాసనసభ్యులుగా ఉన్నామని, రాజీనామాలు చేయడానికి వెనకాడబోమని, అసెంబ్లీకి తీర్మానం వస్తే అడ్డుకోవడానికి మాత్రమే రాజీనామాలు చేయలేదని ఆయన అన్నారు.

తమలో విభేదాలు లేవని, సమైక్యాంధ్ర కోసమే పోరాటం చేస్తున్నామని మంత్రి పార్థసారథి అన్నారు. గందరగోళ పరిస్థితులున్నాయని ఆయన అన్నారు. తామంతా సమైక్యాంధ్ర కోసం ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన అన్నారు. సిడబ్ల్యుసి నిర్ణయాన్ని గౌరవిస్తూనే నిర్ణయంపై పునరాలోచన చేయాలని ముఖ్యమంత్రి చెబుతున్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిపై మాణిక్యవరప్రసాద్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+