'అనంత' బస్సు ప్రమాదం: మృతులు వీరే
అనంతపురం: అనంతపురం జిల్లాలోని పెనుగొండ దగ్గర ఆర్టీసీ బస్సు లోయలో పడిన ఘటనలో మృతి చెందిన 17 మందిలో మావటూరు, నాగలూరు గ్రామాలకు చెందిన వారు అధికంగా ఉన్నారు. వారిని వెంటనే హిందూపురం, పెనుగొండ, అనంతపురం ప్రభుత్వాస్పత్రులకు తరలించి చికిత్స అందజేస్తున్నారు. మావటూరుకు చెందిన నలుగురు, నాగలూరు గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు ప్రమాదంలో మృతి చెందారు.
అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిలో 15 మందిని చికిత్స నిమిత్తం హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అటు అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో ఆరుగురు క్షతగాత్రులకు చికిత్స అందజేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించినట్లు మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి తెలిపారు.
ప్రమాద విషయం తెలిసన వెంటనే జిల్లా మంత్రులు పల్లె, పరిటాల సునీత విజయవాడ నుంచి ఘటనా స్థలికి బయలుదేరారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాల్సిందిగా అధికారులను మంత్రులు ఆదేశించారు. అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి చినరాజప్ప అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదం పట్ల ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

బస్సు ప్రమాదం మృతులు వీరే:
హనుమంతరాయుడు - ఇంటర్ విద్యార్థి(బండ్లపల్లి)
కురబ మురళి - 6వ తరగతి విద్యార్థి(పాతగొబ్బరంపల్లి)
కురబ అశోక్ - ఇంటర్ విద్యార్థి(నాగలూరు)
అనిల్ -ఇంటర్ విద్యార్థి(మావటూరు)
కురబ గంగాధర్ - ఇంటర్ విద్యార్థి(మావటూరు)
అశోక్ - పదవ తరగతి విద్యార్థి(మావటూరు)
బోయ నర్సింహులు - హైస్కూలు విద్యార్థి(నాగలూరు)
అనిత(15) - చెరుకూరు
లక్ష్మీనారాయణ - 9వ తరగతి విద్యార్థి(నాగలూరు)
హరిజన నరేష్ - ఇంటర్ విద్యార్థి(మావటూరు)
సి. రామకృష్ణ (అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అటవీశాఖ - మడకశిర)
శేఖర్ - నాగలూరు
శ్రీనివాసులు(43) - హేమవతి గ్రామం
నరేందర్ - మావటూరు












Click it and Unblock the Notifications