చంద్రబాబు తండ్రి కానీ, మా అబ్బ కానీ ఏమీ చేయలేరు, కోపంతో ఊగిన జెసి
దేవుడు కరుణించకపోతే చంద్రబాబు వాళ్ళ తండ్రి కానీ, మా అబ్బ కానీ ఏమీ చేయలేరని , అనంతపురం ఎంపీ జెసి దివాకర్ రెడ్డి చెప్పారు.
అనంతపురం: దేవుడు కరుణించకపోతే చంద్రబాబు వాళ్ళ తండ్రి కానీ, మా అబ్బ కానీ ఏమీ చేయలేరని , అనంతపురం ఎంపీ జెసి దివాకర్ రెడ్డి చెప్పారు.
జిల్లాలో కరువు సమస్యపై సీపీఎం ఆందోళనకు దిగింది. జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహిస్తున్న సర్వసభ్య సమావేశాన్ని సీపీఎం సభ్యులు అడ్డుకొన్నారు. కరువు వల్ల రైతులు నష్టపోతున్నారని సీపీఎం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే ఆందోళనను విరమింపజేసేందుకు జెసి దివాకర్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అధికారుల వద్ద కూర్చోని మాట్లాడాలి. అల్లరి చేసి నశించాలి, నశించాలి అంటే ఏంది నశించేది అంటూ జెసి అసహనం వ్యక్తం చేశారు.
మీరు నిరసన తెలిపారు. రండీ కలెక్టర్ దగ్గర కూర్చోని మాట్లాడుదాం అంటూ సిపిఎం నేతలను ఉద్దేశించి జెసి వ్యాఖ్యానించారు. మరో వైపు హంద్రీనీవాను వెడల్పు చేయాలి, కుంటలు కట్టుకోవాలి, అప్పుడే సమస్యలకు పరిష్కారం దొరుకుతోందన్నారు జెసి.
భూమాతను పొడిచి పొడిచి చంపుతున్నాం. ఎక్కడైనా చుక్క నీరు వస్తోందా అని ఆయన ప్రశ్నించారు. వర్షాలు రాకపోతే ఎవరూ ఏమీ చేయలేరని చెప్పారు. దేవుడు కరుణించకపోతే చంద్రబాబు కూడ ఏం చేయలేడు. వాళ్ళ నాన్న ఏమీ చేయలేడు. మా అబ్బా ఏమీ చేయలేడంటూ ఆందోళనకారులనుద్దేశించి జెసి వ్యాఖ్యానించారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications