• search
  • Live TV
అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఎన్నిక‌ల వేళ‌..అనంత టిడిపిలో భ‌గ్గుమ‌న్న విభేదాలు : ప‌ంతం నెగ్గించుకున్న జేసీ ..!

|

ఎన్నిక‌ల వేళ‌..టిడిపి కి కొత్త టెన్ష‌న్ ప‌ట్టుకుంది. కొంత కాలంగా నివురుగ‌ప్పిన నిప్పులా ఉన్న టిడిపి నేత‌ల మ‌ధ్య విభే దాలు రోడ్డు పైకి వ‌చ్చాయి. ఎంపి దివాక‌ర్ రెడ్డి వ‌ర్సెస్ ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర్ చౌద‌రి వ‌ర్సెస్ మేయ‌ర్ స్వ‌రూప అన్న‌ట్లుగా అధికారుల స‌మ‌క్షంలో..న‌డి రోడ్డు పై టిడిపి నేత‌ల నిర్వాకం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

రైల్వే వంత‌నె పై పంతం..

అనంతపురంలో రైల్వే పై వంతన ప్రారంభోత్సవంలో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తన పంతం నెగ్గించుకున్నారు. ప్రారం భోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే, మేయర్‌ కలెక్టర్ కోసం వేచి చూస్తుండగానే, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కారు దిగి నేరుగా వె ళ్లి వంతెన ప్రారంభించారు. దీంతో ఎంపీ, ఎమ్మెల్యే, మేయర్‌ మధ్య కొంతకాలంగా ఉన్న విభేదాలు మరోసారి బయటప డ్డాయి. చాలా కాలంగా అనంతపురం నగరంలోని పాతూరులో రహదారుల విస్తరణ విషయంలో ఎంపీ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్య రేగిన వివాదం, చినికి, చినికి గాలివానలా మారి వర్గవిభేదాల వరకు దారితీసింది.

ఇది అంతటితో ఆగకుండా ఇరు వర్గాలు తమ బలనిరూపణకు దిగేవరకు దారితీసింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు జోక్యం చేసుకొని ఇరువురిని కూర్చోబెట్టి గట్టిగా హెచ్చరించి పంపించారు. అమరావతి నుంచి తిరిగొచ్చిన ఇద్దరు నేత లు పాతూరు రోడ్ల విస్తరణ వివాదం కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగానే ఎంపీ దివాకర్ రెడ్డి నగరంలోని రామనగర్ కాలనీకి వెళ్లే దారిలో రైలు పై వంతెన మంజూరు చేయించారు.

Anantapur TDP Leaders Political fight on new fly over : High command serious..!

ప్రారంభోత్స‌వ ర‌గ‌డ‌..
దీని నిర్మాణానికి గుత్తేదారు ఎంపిక విషయంలో ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తీవ్రంగా వ్యతిరేకించారు. గుత్తేదారు వేగంగా నిర్మాణం చేయకపోవడంతో అధికారులను చాలాసార్లు హెచ్చరించారు. వీరి వివాదం కొనసాగుతుండగానే ఆ పై వంతెనకు పేరు పెట్టే విషయంలో ఎమ్మెల్యేకు, నగర మేయర్ స్వరూపకు వివాదం నెలకొంది. వంతెనకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని ఎమ్మెల్యే ప్రభాకర్ నిర్ణయించగా, దీన్ని విభేధించిన మేయర్ స్వరూప సీఎం చంద్రబాబు పేరు పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం రామనగర్ పై వంతెన ప్రారంభానికి ముహూర్తం ఖరారు చేశారు.

ఆ మేరకు జిల్లా కలెక్టర్ నుంచి ముగ్గురి నేతలకు ఆహ్వానం వెళ్లడంతో ప్రభాకర్ చౌదరి అరగంట ముందుగానే ఫ్లైఓవర్‌ వద్ద గల సభాస్థలికి చేరుకున్నారు. మేయర్ స్వరూప కూడా పావుగంట ముందుగానే వచ్చారు. ఇద్దరూ ఎడమొహం, పెడమొహంగా కూర్చుండగా.. ఎంపీ జేసీ కారులో అక్కడికి చేరుకున్నారు. వంతెన ప్రారంభానికి కలెక్టర్ వస్తున్నారని అధికారులు ఎంపీకి చెప్పారు. ఎవరి కోసమో ఎదురు చూడటం ఏంటి.. వచ్చిన పుడు వస్తారులే'' అంటూ ఎంపీ నేరుగా వెళ్లి ఫ్లైఓవర్ ప్రారంభించారు. దివాకర్ రెడ్డి తీరుపై వెంటనే మీడియా సమావేశం పె ట్టి తీవ్రంగా ఎండగట్టిన ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, తనకు జరిగిన అగౌరవాన్ని పార్టీ అధిష్టానం చూసుకుంటుం దన్నా రు. తప్పంతా అధికారులదేనని మేయర్ స్వరూప ఆగ్రహం వ్యక్తం చేయ‌టం కొస మెరుపు.

English summary
Political fight between Anantapur TDP Leaders is in peak stage. In a fly over opening issue MP and Mla and mayor belongs to TDP differed each otehr. Now this issue is in court of party chief.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X