అనంతకు చమన్: ప్రకాశంలో జంప్‌లు, వైసిపికి షాక్?
హైదరాబాద్: అనంతపురం జిల్లా పరిషత్ చైర్మన్‌గా పరిటాల రవి ముఖ్య అనుచరుడు దూదేకుల చమన్ ఎన్నిక కానున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆయన పేరును అధికారికంగా ప్రకటించింది. అనంతపురం జిల్లా రామగిరి నుంచి చమన్ జడ్పీటిసిగా ఎన్నికయ్యారు.
జడ్పీ చైర్మన్ పదవి బిసిలకు రిజర్వ్ అయింది. దీంతో చంద్రబాబు చమన్ పేరును ప్రకటించినట్లు భావిస్తున్నారు. అనంతపురం జిల్లాలో 63 స్థానాలుండగా టిడిపి 42 చోట్ల, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 21 చోట్ల విజయం సాధించింది. దీంతో టిడిపి నుంచి జిల్లా పరిషత్ చైర్మన్‌గా చమన్ ఎన్నిక కావడం ఖాయమైనట్లే.

ఇదిలావుంటే, తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి విషయంలో తెలుగుదేశంలో విభేదాలు భగ్గుమన్నాయి. జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి నామన్ రాంబాబు పేరును చంద్రబాబు ఖాయం చేశారు. రాంబాబు పేరును ఖరారు చేసినట్లు ఉప ముఖ్యమంత్రి చిన్నరాజప్ప శనివారం సమావేశంలో ప్రకటించారు. ఆయన అభ్యర్థిత్వాన్ని పేరాబత్తిన రాజశేఖర్ వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఇదిలావుంటే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మెజారిటీ జడ్పీటిసిలను గెలుచుకున్నప్పటికీ ప్రకాశం జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ వదవిని కైవసం చేసుకోవడానికి తెలుగుదేశం పార్టీ పావులు కదుపుతోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 31 స్థానాలను గెలుచుకోగా, టిడిపి 25 స్థానాలను గెలుచుకుంది. అయితే, ముగ్గురు జడ్పిటీసిలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి షాక్ ఇచ్చి, తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చేందుకు సిద్ధపడినట్లు సమాచారం. ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి టిడిపిలో మన్నే రవీంద్ర, ఈదర హరిబాబు మధ్య పోటీ నడుస్తోంది.












Click it and Unblock the Notifications