Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ ప్రభుత్వంపై యాంకర్ లాస్య సంచలన వీడియో

శ్రీకాకుళం జిల్లా ఉద్దానం.. కిడ్నీ బాధితులకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. నాలుగు దశాబ్దాలుగా పీల్చిపిప్పి చేస్తున్న కిడ్నీ సమస్య సృష్టిస్తున్న కల్లోలం అంతాఇంతా కాదు. ఏళ్ల తరబడి నుంచి చాపకింద నీరులా ఈ ప్రాంతాన్ని కబళిస్తోంది. ఇక్కడున్న జనాభాలో 21 శాతానికి పైగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థంచేసుకోవచ్చు. ఇప్పటికే 15 వేల మంది చనిపోయినట్లు అంచనా.తరాలు మారుతున్నాయి.. ప్రభుత్వాలు మారుతున్నాయి.. అయినా వీరిని పట్టించుకున్న నాథుడే లేరు.

చికిత్స కోసం భారీగానే డబ్బులు ఖర్చు పెట్టి ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటి వరకు ఎన్ని ప్రభుత్వాలు మారిన వారి సమస్యకు మాత్రం పరిష్కారం లభించలేదు. ఎంతోకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఉద్దానం ప్రజలు తమ సమస్యను పరిష్కరించే నాధుడే లేడని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇక్కడి అబ్బాయిలను పెళ్లి చేసుకోవడానికి ఏ అమ్మాయి ముందుకు రాని పరిస్థితి. ఇదే విధంగా ఉద్దానం అమ్మాయిలు కూడా పెళ్లి కాకుండా అలాగే మిగిలిపోతున్నారు. అయితే ఈ సుధీర్ఘ సమస్యకు ఐదేళ్లలోనే చెక్ చెప్పారు సీఎం జగన్.

Anchor lasya video on Kidney Research Centre at Palasa

2019కి ముందుకు పాదయాత్ర సమయంలో ఉద్దానం సమస్యకు శాశ్వత పరిష్కరం చూపుతానని వైసీపీ అధినేత జగన్ అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు. జగన్ కంటే చాలామంది నాయకులు ఉద్దానం సమస్యను తొలగిస్తామని హామీ ఇచ్చి మాట తప్పారు. కానీ జగన్ అలా కాదు అక్కడ ప్రజలకు నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ భరోసా కల్పించారు. 40 దశాబ్దాలుగా ఉద్దానం ప్రజలు పడుతున్న బాధకు శాశ్వత పరిష్కరం చూపించారు. పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం తాగునీటి ఏర్పాటు, కిడ్నీ బాధితుల కోసం ఆస్పత్రిని ఏర్పాటు చేసి వారి సమస్యకు పరిష్కారం చూపించారు.

సీఎం జగన్ పలాసలో రూ.85 కోట్ల వ్యయంతో కిడ్నీ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌తో పాటు ఉద్దానం వాటర్ ప్రాజెక్ట్ నిర్మించారు. అత్యున్నత ప్రమాణాలతో 200 పడకల సూపర్ స్పెషాలిటీ కిడ్నీ ఆసుపత్రి, రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది జగన్ సర్కార్. ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం మెరుగైన కార్పొరేట్‌ వైద్యం ఉచితంగా అందిస్తున్నారు. అలాగే అన్ని రకాల కిడ్నీ వ్యాధులపై పరిశోధనలు చేసేందుకు పలాసలో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్, 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్, డయాలసిస్‌ యూనిట్ల ఏర్పాటు చేశారు.

Anchor lasya video on Kidney Research Centre at Palasa

ఉద్దానం ప్రాంతంలో దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు ప్రబలంగా ఉన్న ఏడు మండలాల్లోని అన్ని గ్రామాలకు సుజలధార' ప్రాజెక్టు ద్వారా శుద్ధి చేసిన తాగునీరు అందిస్తోంది. తాజాగా ఉద్దానం గురించి యాంకర్ లాస్య తన యూట్యూబ్ ఛానెల్‌లో ఓ వీడియో చేశారు. నిజంగానే ఉద్దానం బాధితులకు న్యాయం జరుగుతుందా..వైసీపీ సర్కార్ చెబుతున్నట్టుగా అక్కడి వారికి శాశ్వత పరిష్కరం దొరికిందా అనే దానిపై అక్కడున్న ప్రజలనే నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ వీడియోలో స్థానికులు సంచలన విషయాలను వెల్లడించారు.

అక్కడి కిడ్నీ బాధితులతో నేరుగా మాట్లాడారు యాంకర్ లాస్య. కిడ్నీ బాధితులు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రూ.2500 రూపాయిలు ఇచ్చి చేతులు దూలుపుకునేవారు. అవి ఆరోగ్య ఖర్చులకు కూడా సరిపోయేవి కావు..ఇల్లు గడవడం కష్టంగా ఉండేదని..ఇంట్లో వారే అసహ్య హించుకునేవారని బాధితులు వాపోయారు.జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత మమ్మల్ని అన్ని రకాలుగా ఆదుకున్నారని బాధితులు తెలిపారు. రూ.2500 నుంచి రూ.10,000 రూపాయిలు పెంచుతూ జగన్ తీసుకున్న నిర్ణయం మాకు ఆర్థికంగా నిలబడటానికి దోహదపడిందని వారు తెలిపారు.

ఇక కిడ్నీ హాస్పిటల్‌తో పాటు ఉద్దానం వాటర్ ప్రాజెక్ట్‌ను సందర్శించిన యాంకర్ లాస్య అక్కడ అందిస్తోన్న వైద్యం గురించి ప్రజలకు వివరించారు. ఈ ప్రాంతంలో ప్రస్తుతం 6 లక్షలకుపైగా జనాభా ఉండగా అవసరాలకు సరిపోయేలా ఒక్కొక్కరికి రోజుకు 100 లీటర్ల చొప్పున నీటి సరఫరా చేపట్టిన విధానం గురించి కూడా లాస్య తన వీడియోలో చూపించారు. ఈ విధంగా సీఎం జగన్ పాదయాత్రలో తాను ఇచ్చిన మాటలను నిలబెట్టుకుంటూ ప్రజల మనస్సును గెల్చుకున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+