పాపం .. యాంకర్ రష్మీ ఓటు కోసం ఎన్ని పాట్లు పడిందో మీకు తెలుసా ?

తెలుగు రాష్ట్రాల్లో ఓటింగ్ మొదలైంది . ఇప్పటికే ఉద్యోగ నిమిత్తం వివిధ ప్రాంతాల్లో ఉన్నవారు ఓటు వేయడానికి సొంత ప్రాంతాలకు చేరుకున్నారు . ఇంకా చాలా మంది ప్రయాణాలలో ఉన్నారు . తాజాగా రష్మీ కూడా తన ఓటు హక్కు వినియోగించుకోవటం కోసం వైజాగ్ చేరుకుంది. ఇక ఆమె నిన్న ఓటు కోసం చేసిన హడావిడీ అంతా ఇంతా కాదు.

ఓటు కోసం యాంకర్ రష్మీ హడావిడి

జరగబోయే ఎన్నికల్లో తనతో పాటు తన తల్లికి ఇప్పటి వరకు ఓటర్ స్లిప్పులు అందలేదని ఎక్స్‌ట్రా జబర్థస్త్ యాంకర్ రష్మీ హడావిడి చేసింది . తనకు విశాఖపట్నంలో ఓటర్ ఐడీ ఉందని అక్కడే ఎప్పటి నుంచో నివాసం ఉంటున్నామని కూడా చెప్పింది. తమతో పాటు తాము ఉంటున్న నివాస సముదాయంలో ఎవరికీ ఓటర్ స్లిప్పులు అందలేదన్న విషయంపై ఆమె అధికారులకు ఫిర్యాదు చేశామని కూడా తెలిపింది. నిన్న సాయంత్రం వరకు ఓటర్ స్లిప్పుల కోసం వేచి చూస్తానని రష్మీ ట్విట్టర్‌లో స్పష్టం చేసింది. ఆ తర్వాత ఏం చేయాలనే విషయమై స్పందిస్తానని చెప్పింది.

Anchor Rashmi faced problems for vote .. do you know what happened

ట్రోల్ చేసిన నెటిజన్లు ... మేము బతికే ఉన్నాముగా అంటూ రష్మి ఫైర్

ఇక అక్కడే నెటిజన్ల నుండి ఆమెకు ట్రోల్స్ ప్రారంభం అయ్యాయి. నెటిజన్లు ఓటు వుందో లేదో ముందు ఎందుకు చూసుకోలేదు అంటూ రష్మీపై విరుచుకుపడ్డారు. దాంతో రష్మీ నెటిజన్ల వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించింది. మేం చచ్చిపోలేదుగా , బ్రతికే ఉన్నాముగా , ఇక మా ఇంటి అడ్రెస్ కానీ ఏది మారలేదు కదా .. ఓటు ఉండదు అని మేము ఎందుకు అనుకుంటాము అంటూ ఫైర్ అయ్యింది రష్మి. మొత్తానికి రష్మి ఓటరు స్లిప్ వచ్చింది . అయినప్పటికీ రష్మిని నెటిజన్లు చేసిన ట్రోల్స్, నెటిజన్ లకు రష్మి సమాధానం, వారి వ్యాఖ్యలకు ఆమె ఘాటుగా స్పందించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+