Syamala: వీడియో విడుదల చేసిన శ్యామల..!
Anchor Syamala: రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవి చూసిన నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ సానుభూతిపరులు, కార్యకర్తలు, నాయకులపై దాడులు మొదలయ్యాయి. మాజీ మంత్రులను సైతం వదలట్లేదు టీడీపీ శ్రేణులు.
మొన్నటి ఎన్నికల్లో అటు అసెంబ్లీ, ఇటు లోక్‌సభ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు దారుణంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. 175 అసెంబ్లీ స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీకి దక్కింది.. 11 స్థానాలే. కంచుకోటల్లాంటి నియోజకవర్గాలను వైఎస్ఆర్సీపీ కోల్పోయింది. విశాఖపట్నం- 2, చిత్తూరు-2, కర్నూలు- 2, ప్రకాశం- 2, కడప- 3.. ఇవీ ఆ పార్టీ అభ్యర్థులు గెలిచిన నియోజకవర్గాల సంఖ్య.

ఈ పరిణామాలపై తాజాగా యాంకర్ శ్యామల స్పందించారు. తనకూ బెదిరింపు ఫోన్ కాల్స్ అందుతున్నాయని అన్నారు. వాటిని చూస్తోంటే తనకు భయంగానే ఉందని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ- తాను వైఎస్ఆర్సీపీలోనే కొనసాగుతానని తేల్చి చెప్పారు. వైఎస్ జగన్ వెంటే ఉంటాననీ స్పష్టం చేశారు.
అందరికీ ఒకటే నచ్చాలని లేదని శ్యామల చెప్పారు. అందరికీ ఒకటే నచ్చాలనుకోవడం చాలా అన్యాయమని అన్నారు. తాను ఎవరి మీద వ్యక్తిగతంగా విమర్శలు చేయలేదని గుర్తు చేశారు. ఒక పార్టీని గెలిపించే ప్రయత్నంలో తాను ఎంత చేయాలో.. అంతా చేశానని, ఉన్నదే చెప్పానని పేర్కొన్నారు.
ఈ ఎన్నికల్లో విజయం సాధించిన తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమికి ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగితిస్తున్నానని పేర్కొన్నారు. ఇది ప్రజల తీర్పు అని, దాన్ని శిరసా వహిస్తున్నానని అన్నారు. వైసీపీ గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు.
గెలిచిన నాడు ఎప్పుడూ విజయగర్వంతో పొంగిపోలేదని, ఓడిపోయినప్పుడు కుంగిపోలేదని శ్యామల వ్యాఖ్యానించారు. ఈ దఫా వైఎస్ జగన్ మరింత బలాన్ని పుంజుకుని, మళ్లీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తారని చెప్పారు. ఆయన వెంటే అందరం నడుద్దామని విజ్ఞప్తి చేశారు.
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications