ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 120+ స్థానాలతో సునామీ సృష్టించనున్న ఆ పార్టీ
Andhra Assembly elections 2024: సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఆ దిశగా ముమ్మర కసరత్తు సాగిస్తోన్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సిద్ధం బహిరంగ సభలతో ఎన్నికల రణభేరీని మోగించింది.
ఇటీవలే విశాఖపట్నం జిల్లా భీమిలీలో నిర్వహించిన సభలో లక్షలాది మంది జనం మధ్య ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ నెల 3వ తేదీన మలి విడత సభను ఏలూరు జిల్లా దెందులూరులోనిర్వహించబోతోంది వైఎస్ఆర్సీపీ. దీనికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అయిదు విడతల్లో 75 అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించింది.

అటు తెలుగుదేశం పార్టీ కూడా జనంలోకి వెళ్తోంది. రా.. కదలిరా సభలతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్త పర్యటనలనను చేపట్టారు. అదే సమయంలో అభ్యర్థుల ఎంపికపైనా దృష్టి పెట్టారు గానీ.. ఆ వ్యవహారం అంత త్వరగా తేలట్లేదు. మిత్రపక్షం జనసేన పార్టీతో సీట్ల పంపకాలు ఇంకా కొలిక్కి రావట్లేదు.
ఈ పరిస్థితుల మధ్య ఏపీలో జరగబోయే ఎన్నికలపై సర్వే నివేదికలు ఒక్కటొక్కటిగా వెలువడుతున్నాయి. పోల్ స్ట్రాటజీ గ్రూప్, పొలిటికల్ క్రిటిక్, లోక్ పోల్.. వంటి జాతీయ స్థాయి సర్వే సంస్థలు తమ అంచనాలను బయటపెట్టాయి. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయంపై తమ అభిప్రాయాలను వెల్లడించాయి.
అవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపాయి. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ వరుసగా రెండోసారి అధికారాన్ని అందుకుంటుందని అంచనా వేశాయి. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారనీ స్పష్టం చేస్తోన్నాయి. 52 శాతం మంది ముఖ్యమంత్రిగా జగన్‌ను కోరుకుంటోన్నాయని తేల్చి చెప్పాయి.
తాజాగా మరో సర్వే సైతం ఇదే విషయాన్ని ధృవీకరించింది. కొద్దిసేపటి కిందటే తన ఎన్నికల సర్వే ఫలితాలను వెల్లడించింది. డిసెంబర్ 1 నుంచి జనవరి 12వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో చేపట్టిన సర్వే ఇది. అన్ని నియోజకవర్గాల్లో 88,700 మంది అభిప్రాయాలను సేకరించింది.
ఏపీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 122 స్థానాలతో వైఎస్ఆర్సీపీ విజయఢంకా మోగిస్తుందని అంచనా వేసింది. తెలుగుదేశం-జనసేన పార్టీ 53 సీట్లకే పరిమితమౌతాయని తెలిపింది. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ కనీసం తమ ఖాతాను కూడా తెరవలేవని స్పష్టం చేసింది ఎలెక్‌సెన్స్ సర్వే రిపోర్ట్.
ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి 49.14 శాతం మేర ఓట్లు పోల్ అవుతాయని అభిప్రాయపడింది. టీడీపీ-జనసేకు 44.34, బీజేపీ-0.56, కాంగ్రెస్-1.21 శాతం మేర ఓట్లు పడతాయని వివరించింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై 53.7 శాతం మంది సంతృప్తిని వ్యక్తం పరిచారు. 6.3 శాతం మంది ఫర్వాలేదని పేర్కొన్నారు.
జగన్ పరిపాలనను మెచ్చుకున్న వారిలో పురుషుల కంటే మహిళలే అధికంగా ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. మొత్తంగా 59.3 శాతం మంది మహిళలు జగన్ పరిపాలన పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. 49.6 శాతం మంది పురుషులు సానుకూలంగా స్పందించారు.
జిల్లాలవారీగా చూసుకుంటే- విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో మాత్రమే టీడీపీ- జనసేన హవా స్పష్టంగా కనిపించింది. ఈ రెండు జిల్లాల్లోనే వైఎస్ఆర్సీపీ కంటే అధిక స్థానాలను ఈ కూటమి గెలుచుకోగలుగుతుందుి. విశాఖపట్నంలో 10, తూర్పు గోదావరిలో 9 స్థానాలతో ఆధిక్యతలను సాధిస్తుంది. మిగిలిన ఏ జిల్లాలో కూడా వైసీపీ సునామీని ఈ కూటమి తట్టుకోకపోవచ్చు.
శ్రీకాకుళం: వైసీపీ- 7, టీడీపీ-2 స్థానాలను గెలుచుకుంటాయి. ఒక్కచోట హోరాహోరీ పోరు ఉంటుంది.
విజయనగరం: వైసీపీ- 8, టీడీపీ-0. ఒక్కచోట హోరాహోరీ పోరు
విశాఖపట్నం: వైసీపీ- 4, టీడీపీ-10. ఒక్కచోట హోరాహోరీ పోరు
తూర్పు గోదావరి: వైసీపీ- 7, టీడీపీ-9. మూడుచోట్ల హోరాహోరీ పోరు
పశ్చిమ గోదావరి: వైసీపీ- 8, టీడీపీ-3. నాలుగు చోట్ల హోరాహోరీ పోరు
కృష్ణా: వైసీపీ- 9, టీడీపీ-5. రెండుచోట్ల హోరాహోరీ పోరు
గుంటూరు: వైసీపీ- 11, టీడీపీ-3. మూడుచోట్ల హోరాహోరీ పోరు
ప్రకాశం: వైసీపీ- 8, టీడీపీ-2. రెండుచోట్ల హోరాహోరీ పోరు
నెల్లూరు: వైసీపీ- 9, టీడీపీ-1
చిత్తూరు: వైసీపీ- 12, టీడీపీ-2
కడప: వైసీపీ- 10, టీడీపీ-0
కర్నూలు: వైసీపీ- 12, టీడీపీ-0. రెండుచోట్ల హోరాహోరీ పోరు
అనంతపురం: వైసీపీ- 8, టీడీపీ-2. నాలుగు చోట్ల హోరాహోరీ పోరు












Click it and Unblock the Notifications