ముంచుకొస్తున్న హుధుద్: ఈ ప్రాంతాలకు ముప్పు
హైదరాబాద్: హుధుద్ తుఫాను ముప్పు ఆంధ్రప్రదేశ్‌లోని 63 మండలాలకు ఉన్నట్లు గుర్తించారు. శ్రీకాకుళం (11), విజయనగరం (7), విశాఖపట్నం (10), తూర్పు గోదావరి (25), పశ్చిమ గోదావరి (11) జిల్లాలను తుఫాను తాకే ప్రమాదం ఉంది. ఇప్పటి వరకు 500 గ్రామాల నుంచి 4.56 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించనున్నట్లు అధికార వర్గాలు చెప్పాయి. రాష్ట్ర ప్రభుత్వం 392 సహాయక శిబిరాలను ఏర్పాటు చేసింది. తుఫాను ఆదివారం సాయంత్రం విశాఖపట్నం తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 155 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.
విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం, చాపలకంచేరు గ్రామాల వద్ద సముద్ర తీరంలో భారీగా అలలు ఎగిసిపడుతున్నాయి. ముక్కాంలో సముద్రం దాదాపు 8 మీటర్ల మేర ముందుకు వచ్చింది. తుఫాను పశ్చిమ బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతోంది. విశాఖకి తూర్పు - ఆగ్నేయ దిశలో 330, ఒడిశాలోని గోపాలపూర్‌కి దక్షిణ - ఆగ్నేయ దిశలో 380 కిలోమీటర్ల దూరంలో పెను తుఫాను కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమంగా పశ్చిమ వాయవ్య దిశగా కదిలి మరో 12 గంట్లలో తీవ్రమైన పెను తుఫానుగా మారే ప్రమాదం ఉంది.
ఆదివారం వీచే పెను గాలులకు ఇళ్ల పైకప్పులు ఎగిరిపడడం, విద్యుత్తు స్తంభాలు విరిగి పడడం, రైలు రోడ్డు మార్గాలు కొట్టుకుపోవడం, రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం కలగడం వంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కళింగపట్నం, గంగవరం ఓడరేవుల్లో ఏడో నెంబర్, కాకినాడ, మచిలీపట్నం ఓడరేవుల్లో ఐదో నెంబర్, కృష్ణపట్నం, నిజాంపట్నం ఓడరేవుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు.
విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం అంచనా మేరకు తీవ్ర పెనుతుఫాన్ తీరం దిశగా వచ్చేకొద్దీ గాలుల ఉధృతి, వర్షాలు పెరుగుతాయి. శనివారం ఉదయం నుంచి శ్రీకాకుళం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా వరకు అనేకచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, అక్కడక్కడా కుంభవృష్టిగా వర్షాలు కురుస్తాయి. కృష్ణా నుంచి ప్రకాశం జిల్లా వరకు విస్తారంగా, పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి. ఉత్తరకోస్తాలో తీరం వెంబడి గంటకు 50 నుంచి 60, అప్పుడప్పుడు 70 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. ఆదివారం ఉదయం నుంచి గాలుల వేగం మరింత పెరుగుతుంది.
తుఫాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారిందని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్‌ఫర్మేషన్(ఇన్‌కాయిస్)తెలిపింది. సముద్రంలో అలలు రెండు మీటర్లపైనే ఎగిసిపడుతున్నాయని తెలిపింది. శనివారానికి మరింత ఎక్కువై, ఆదివారానికి భయంకరంగా మారుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని, ప్రస్తుతం సముద్రంలో ఉన్న మత్స్యకారులు వెంటనే ఒడ్డుకు రావాలని సూచించింది.

ఎగిసిపడుతున్న అలలు
విశాఖపట్నం సముద్ర తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి. తుఫాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా మారుతోంది.

ఎగిసిపడుతున్న అలలు
తుఫాను పశ్చిమ బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతోంది. విశాఖకి తూర్పు - ఆగ్నేయ దిశలో 330, ఒడిశాలోని గోపాలపూర్‌కి దక్షిణ - ఆగ్నేయ దిశలో 380 కిలోమీటర్ల దూరంలో పెను తుఫాను కేంద్రీకృతమై ఉంది.

ఎగిసిపడుతున్న అలలు
బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తుఫాను క్రమంగా పశ్చిమ వాయవ్య దిశగా కదిలి మరో 12 గంట్లలో తీవ్రమైన పెను తుఫానుగా మారే ప్రమాదం ఉంది.

ఎగిసిపడుతున్న అలలు
కళింగపట్నం, గంగవరం ఓడరేవుల్లో ఏడో నెంబర్, కాకినాడ, మచిలీపట్నం ఓడరేవుల్లో ఐదో నెంబర్, కృష్ణపట్నం, నిజాంపట్నం ఓడరేవుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు.

ఎగిసిపడుతున్న అలలు
విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం అంచనా మేరకు తీవ్ర పెనుతుఫాన్ తీరం దిశగా వచ్చేకొద్దీ గాలుల ఉధృతి, వర్షాలు పెరుగుతాయి. శనివారం ఉదయం నుంచి శ్రీకాకుళం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా వరకు అనేకచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, అక్కడక్కడా కుంభవృష్టిగా వర్షాలు కురుస్తాయి.

ఎగిసిపడుతున్న అలలు
ఉత్తరకోస్తాలో తీరం వెంబడి గంటకు 50 నుంచి 60, అప్పుడప్పుడు 70 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. ఆదివారం ఉదయం నుంచి గాలుల వేగం మరింత పెరుగుతుంది.

ఎగిసిపడుతున్న అలలు
తుఫాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారిందని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్‌ఫర్మేషన్(ఇన్‌కాయిస్)తెలిపింది. సముద్రంలో అలలు రెండు మీటర్లపైనే ఎగిసిపడుతున్నాయని తెలిపింది.

ఎగిసిపడుతున్న అలలు
శనివారానికి అలలు మరింత ఎక్కువై, ఆదివారానికి భయంకరంగా మారుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని, ప్రస్తుతం సముద్రంలో ఉన్న మత్స్యకారులు వెంటనే ఒడ్డుకు రావాలని సూచించింది.

ఎగిసిపడుతున్న అలలు
తుఫాను ప్రభావంతో విశాఖ జిల్లా నక్కపల్లి మండలంలోని రాజయ్యపేట, బోయపాడు, బంగారంపేట గ్రామల వద్ద సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి.

ఎగిసిపడుతున్న అలలు
సముద్రం దాదాపు 60 అడుగుల మేర ముందుకు వచ్చినట్లు విశాఖపట్నం తీరంలోని గ్రామాల ప్రజలు చెబుతున్నారు.

ఎగిసిపడుతున్న అలలు
మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా విశఆఖ పట్నం పోలీసులు వివిధ ప్రాంతాల్లో గస్తీ తిరుగుతున్నారు. జాలర్లు ముందు జాగ్రత్తగా తెప్పలు, వలలను తీసుకుని సురక్షిత ప్రాంతాలకు చేరుకుంటున్నారు.
ఉప్పాడ బీచ్ రోడ్డు మూసివేత
తుఫాన్ ప్రభావం వలన ఉప్పాడ తీరంలో సముద్రం వెనక్కి తగ్గింది. శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సముద్రం చాపలా ఉండటం, కేవలం ఒడ్డునే కెరటాలు విరుచుకొని పడ్డాయి. సాయంత్రం 3 గంటల సమయంలో సముద్రం ఉన్నట్టుండి ఒడ్డు నుంచి చాలా దూరం వెనక్కిపోవడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. సముద్రం వెనక్కివెళ్ళడం, ఎప్పుడు నిటారుగా పైకి లేచే సముద్రకెరటాలు మధ్యాహ్నం నుంచి క్రాస్‌గా పైకి లేవడం వంటి పరిణామాలతో తుఫాన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని తీర ప్రాంత మత్స్యకారులు ఆందోళనచెందుతున్నారు. బీచ్‌రోడ్డులో చిన్నవంతెన వద్ద కెరటాలు ఎగసి పడుతుండటంతో ఉప్పాడ-కాకినాడ రోడ్డులో రాకపోకలను రద్దుచేశారు.
నేడు, రేపు బాబు పర్యటనలు రద్దు
హుద్‌హుద్ తుఫాన్ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శని, ఆదివారంలో చేపట్టాల్సిన జిల్లా పర్యటలు రద్దయ్యాయి. జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం ఆయన ప్రస్తుతం ప్రతి రోజూ జిల్లాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. కోస్తా ప్రాంతంలో తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండనుండడంతో ఆయన ఈ రెండు రోజులూ తన పర్యటనలను రద్దు చేసుకొన్నారు. రాజధానిలో ఉండి తుఫాన్ బాధితుల సహాయ కార్యక్రమాలను ఆయన పర్యవేక్షిస్తారు. తుఫాన్ ప్రభావం పెద్దగా లేకపోతే సోమవారం ఆయన కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్తారు. తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంటే ఆ ప్రాంతాల పరిశీలనకు చంద్రబాబు వెళ్లే అవకాశముంది.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!!












Click it and Unblock the Notifications