ap cm jagan joins Koo App: మాతృభాషలో ప్రజలకు చేరువయ్యేందుకే -సీఎంవో, వైసీపీ కూడా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రముఖ భారతీయ మైక్రో బ్లాగింగ్ మరియు సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫారమ్ ''కూ'' (Koo ) లో చేరారు. ప్రజలను నేరుగా వారి మాతృభాషల్లో చేరుకోవాలనే ఉద్దేశ్యంతో కూలో చేరినట్లు ఆ సంస్థ తెలిపింది. ఇది యూజర్లకు వారి మాతృభాషలో సంభాషించేందుకు వీలు కల్పిస్తుందని స్పష్టం చేసింది.
దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖుల బాటలోనే ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా కూ యాప్ ద్వారా ప్రజలకు మరింత చేరువ కానున్నారు. ఈ వివరాలను యాప్ ప్రతినిధులు ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు. భారత మైక్రో బ్లాగింగ్, సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ అయిన కూ యాప్... వినియోగదారులకు స్థానిక భాషలలో సైతం ఇంటరాక్ట్ అయ్యే అవకాశం కల్పిస్తోంది.

ముఖ్యమంత్రి జగన్ చేరడంతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (@YSRCPOfficial), ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం, సీఎంఓ ఆంధ్రప్రదేశ్ (@AndhraPradeshCM) మరియు ఏపీ డిజిటల్ కార్పొరేషన్ (@APDigitalCorp) వారి అధికారిక అకౌంట్లను భారతీయ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ లో ప్రారంభించారు. @Ysjagan హ్యాండిల్ ని ఉపయోగించి జగన్ మోహన్ రెడ్డి ప్రజలతో తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో సంభాషిస్తారు.
సీఎం జగన్ Koo (కూ) ప్రొఫైల్ నుంచి ఇటీవల పోస్ట్ అయిన వీడియోలో స్థిరమైన ఆసుపత్రుల నిర్మాణాల అవసరాన్ని సీఎం తెలియజేశారు. కూ యూజర్లు సీఎం జగన్ ను https://www.kooapp.com/profile/ysjagan ద్వారా కనెక్ట్ కావొచ్చు. ఈ సందర్భంగా Koo (కూ) సహ వ్యవస్థాపకుడు మయాంక్ బిదవత్క ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని స్వాగతిస్తూ, Koo (కూ) యాప్ లో వారి ఉనికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు మాట్లాడే వారందరికీ మేలు చేస్తుందని నమ్ముతున్నాను" అని తెలిపారు.
Recommended Video
Koo (కూ) బాగా పాపులర్ అయినందున రాష్ట్రం నుంచి ఇంకా చాలా మంది ప్రముఖులు, తత్వవేత్తలు, ప్రాంతీయ పార్టీలు ఈ యాప్ లో చేరాలని భావిస్తున్నాయన్నారు. ప్రజలు తెలుగుతో పాటు Koo (కూ) అందించే ఇతర భాషలలోని వ్యక్తులతో సంభాషించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఇటీవల సీనియర్ సినిమా తనికెళ్ల భరణి, సీనియర్ నటి విజయశాంతి,నటుడు, రచయిత ఎల్‌బి శ్రీ రామ్, హీరోయిన్లు ఈషా రెబ్బా, అనుష్క శెట్టి నటుడు నాగ శౌర్య కూడా Koo (కూ) లో చేరారు.












Click it and Unblock the Notifications