రాహుల్ తో షర్మిల భేటీ, రాజ్యసభ సీటు పై కీలక నిర్ణయం..!!

పీసీసీ చీప్ షర్మిల ఢిల్లీ చేరుకున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం పిలుపు మేరకు ఢిల్లీకి వచ్చిన ఏపీసీసీ చీఫ్ షర్మిల రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. దాదాపు అరగంట సేపు ఇద్దరి మధ్య మంత్రాంగం సాగింది. రాష్ట్ర రాజకీయాల పైన చర్చ జరిగింది. ఇదే సమయంలో గతంలో ఇచ్చిన హామీ మేరకు తనకు రాజ్యసభ సీటు ఇవ్వాలని షర్మిల కోరినట్లు సమాచారం. అయితే, రాజ్యసభ సీటు విషయం లో రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలకు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. రాహుల్ గాంధీతో షర్మిల భేటీ అయ్యారు. సుదీర్ఘ మంత్రాంగం జరిగింది. షర్మిల తెలంగాణలో స్థాపించిన వైటీపీ కాంగ్రెస్ లో విలీనం వేళ రాజ్యసభ సీటు పైన హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీ అమలు దిశగా రాహుల్ గాంధీ కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా షర్మిలకు పిలుపు వచ్చింది. ప్రస్తుతం కర్ణాటక నుంచి రాజ్యసభకు ముగ్గురు సభ్యులు కాంగ్రెస్ నుంచి ఎన్నిక కానున్నారు. ఈ విడతలో, షర్మిలకు రాజ్యసభ అవకాశం ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్ఠానం...ఆ దిశగా కసరత్తు చేస్తోంది. కర్ణాటక లేదా ఢిల్లీ కోటాలో షర్మిలకు రాజ్యసభ దక్కే అవకాశం ఉందని పార్టీ నేతల సమాచారం. అందులో భాగంగా షర్మిలకు రాజ్యసభ సీటు పైన కసరత్తు జరుగుతోందని... ఆ నిర్ణయం తనకు వదిలేయాలని రాహుల్ సూచించినట్లు సమాచారం. ఇదే సమయంలో షర్మిలకు కీలక టాస్క్ అప్పగించారని తెలుస్తోంది.

రాజ్యసభకు నాగబాబు, కేంద్ర మంత్రిగా ఛాన్స్ - బాలినేనికి ఎమ్మెల్సీ పదవి..!?
రాజ్యసభకు నాగబాబు, కేంద్ర మంత్రిగా ఛాన్స్ - బాలినేనికి ఎమ్మెల్సీ పదవి..!?
pcc-chief-ys-shramila-meets-rahul-gandhi-at-delhi-key-discussions-over-rajyasabha-seat

కర్ణాటక నుంచి రాజ్యసభకు షర్మిల..!?

కాంగ్రెస్ చిరునామా గల్లంతు చేసిన జగన్ లక్ష్యంగా షర్మిలకు పీసీసీ చీఫ్ పగ్గాలు అప్పగించిన కాంగ్రెస్ నాయకత్వం.. ఇప్పుడు మళ్లీ కొత్త వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ఏపీలో కూటమి అధికారంలో ఉంది. జగన్ తిరిగి వచ్చే ఎన్నికల కోసం సమాయత్తం అవుతున్నారు. షర్మిల పైనా సొంత పార్టీలో విభేదాలు ఉన్నాయి. పార్టీ కంటే అన్న జగన్ పైనే రాజకీయంగా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారనే విమర్శలు సొంత పార్టీ నుంచే ఉన్నాయి.

దీంతో.. ఏపీలో షర్మిల కు మద్దతుగా తమిళనాడు సీఎం విజయ్.. కర్ణాటకలో కాబోయే సీఎం డీకే శివ కుమార్ సహకారం తో కొత్త కార్యాచరణ అమలు చేసేందుకు సిద్దం అవుతున్నారు. పార్టీలో అందరినీ సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేసినట్లు సమాచారం. కర్ణాటకలో సీఎం మార్పు పైన అధికారిక ప్రకటన.. ప్రమాణ స్వీకారం తరువాత.. అధికారికంగా రాజ్యసభ అభ్యర్ధుల ను పార్టీ ప్రకటించనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+