ఏపీలో ఉలుకుపలుకు లేని కాంగ్రెస్.. !!

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్ పై కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. ఎన్నికల కమిషన్‌లో నిర్ణయాలు ఏకపక్షంగా సాగుతున్నాయని, ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలుగుతోందని ఆరోపిస్తూ దేశంలోని పలు నగరాల్లో కాంగ్రెస్ శ్రేణులు రోడ్లపైకి వచ్చి ప్రదర్శనలు చేపట్టాయి. వేల సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చి ఆందోళనల్లో పాల్గొంటోన్నారు.

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ రోడ్డెక్కి ధర్నాలు, ఆందోళనలు చేస్తోంటే ఏపీలో మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. జ్ఞానేష్ కుమార్ రాజీనామా వ్యవహారంలో ఏపీ కాంగ్రెస్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఊరందరిదీ ఒక ఎత్తయితే ఉలిపిరి కట్టెది మరో దారి అన్నట్లుగా తయారైంది. మెజారిటీ రాష్ట్రాల్లో కనిపిస్తోన్న ఆందోళనలు ఏపీలో నామమాత్రంగా కూడా కనిపించట్లేదు. ఏ ఒక్కరు కూడా రోడ్డెక్కిన పాపాన పోలేదు. తోటి తెలుగు రాష్ట్రం తెలంగాణలో కూడా కాంగ్రెస్ శ్రేణులు ధర్నాలు చేపట్టాయి. జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశాయి.

Andhra Congress Committee Stays Calm as the Party Launched Nationwide Protests on CEC Gyanesh Kumar

జ్ఞానేష్ కుమార్ వ్యవహారం వెలుగులోకి తెచ్చిన ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ జర్నలిస్ట్ రితిక చోప్రా పోస్ట్ ను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిల రీపోస్ట్ చేసి చేతులు దులుపుకొన్నారు. ప్రస్తుతం ఆమె కుమార్తె వివాహ కార్యక్రమాల్లో తలమునకలై ఉన్నారు. ఓ తల్లిగా ఆ బాధ్యతను నెరవేర్చుతున్నారు. పార్టీలో ఇతర పదవుల్లో ఉన్న నాయకులు కూడా జ్ఞానేష్ కుమార్ వ్యవహారంపై పెద్దగా స్పందించినట్లు కనిపించట్లేదు.

మళ్లీ రగులుతున్న జంతర్ మంతర్: భారీ ఆందోళనలు
మళ్లీ రగులుతున్న జంతర్ మంతర్: భారీ ఆందోళనలు

జ్ఞానేష్ కుమార్ ఎపిసోడ్ అల్లాటప్పా అంశం ఏమీ కాదు. కాంగ్రెస్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.. దీన్ని. ఓట్ చోరీని ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా అభివర్ణిస్తోంది. ఇన్నాళ్లూ ఎదురులేదని భావిస్తూ వచ్చిన ఎన్డీఏ ఆయువుపట్టు తన చేతికి చిక్కినట్టు భావిస్తోంది. అటు కాక్రోచ్ జనతా పార్టీ కంటే ముందే దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. దాన్ని క్షణాల్లో అమలులోకి తీసుకొచ్చింది. చివరికి మణిపూర్ వంటి చిన్న రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ శ్రేణులు రోడ్డెక్కాయి. నిరసన ప్రదర్శనలను నిర్వహిస్తోన్నాయి.

ఈ దేశాన్ని ఆ దేవుడే కాపాడాలి: రైలు ప్రయాణంలో ఎంపీ తేజస్వి సూర్య భార్యకు చేదు అనుభవం
ఈ దేశాన్ని ఆ దేవుడే కాపాడాలి: రైలు ప్రయాణంలో ఎంపీ తేజస్వి సూర్య భార్యకు చేదు అనుభవం

ఏపీలో మాత్రం కాంగ్రెస్ శ్రేణులు పెద్దగా స్పందించట్లేదు. రోడ్డెక్కడం కాదు కదా.. కనీసం ట్వీట్లు కూడా లేవు ఏపీ కాంగ్రెస్ అధికారిక ఎక్స్ ప్లాట్ ఫామ్ పై. ఛాత్రోం కీ గూంజ్, ప్రభుత్వ పాఠశాలల మూత వంటి అంశాలపై అప్ డేట్స్ ఉన్నాయే తప్ప జ్ఞానేష్ కుమార్ ఉదంతంపై పోస్టులు లేవు. కూతురి పెళ్లిలో వైఎస్ షర్మిల బిజీగా ఉన్నారనుకున్నా ఇతర నాయకులైనా దీనిపై మాట్లాడకపోవడం సామాన్య ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఇదే వివాదంపై వామపక్షాలు సైతం ఏకతాటిపైకి వచ్చాయి. 26 నుంచి అక్టోబర్ 2 వరకు వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించబోతోన్నాయి. బీజేపీయేతర, లౌకిక, ప్రజాస్వామ్య శక్తులతో పాటు పౌర సమాజాలు కూడా కలిసి రావాలని పిలుపునిచ్చాయి. సీపీఐ, సీపీఐ (ఎంఎల్-న్యూ డెమోక్రసీ), సీపీఐ (ఎంఎల్), ఫార్వర్డ్ బ్లాక్, ఆర్ఎస్పీ, ఎస్‌యూసీఐ.. కలిసి ఉద్యమించనున్నాయి.

కన్నుమూసేంత వరకూ ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ కు కేరాఫ్ గా నిలిచారు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అన్ని పక్షాలు ఏకమైనా, మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పేరుతో ఎన్నికల బరిలో దిగినా.. 2009లో నాటి ఎన్నికల్లో ఒంటిచేత్తో కాంగ్రెస్ ను వరుసగా రెండోసారి అధికారంలోకి తీసుకుని రాగలిగారు. అదనంగా ఏ ఒక్క పథకాన్ని ప్రకటించకుండా, పార్టీ గెలిచినా, ఓడినా తనదే పూర్తి బాధ్యత అని సవాల్ విసిరి మరీ పార్టీని గెలిపించుకొచ్చారు వైఎస్ఆర్.

అలాంటి నాయకుడి వారసురాలిగా కాంగ్రెస్ పగ్గాలను చేతికి అందుకున్న షర్మిల ఆ స్థాయిలో దూకుడు ప్రదర్శించట్లేదనేది స్పష్టమౌతోంది. ఓట్ చోరీపై ఇప్పటికే జనాల్లో అనేక అనుమానాలు ఉన్నాయనేది తెలిసిన విషయమే. దీన్ని కూడా షర్మిల సారథ్యంలోని ఏపీ కాంగ్రెస్ అందిపుచ్చుకోవట్లేదు. ఈ విషయంలో విఫలమైనట్టే కనిపిస్తోంది. ఇక ముందైనా ఏపీసీసీలో ఎలాంటి కదలికలు ఉంటాయనేది వేచి చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+